/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Tuesday, December 7, 2021

విష్వక్సేనుడు: శ్రీమహా విష్ణువు సర్వసైన్యాధిపతి

తిరుమల శ్రీవారికి నిర్వహించే నిత్య కైంకర్యాలలో విష్వక్సేనులది ప్రధాన పాత్ర. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావించే విష్వక్సేనుని ఎవరు ఆరాధిస్తారో వారికి ఎలాంటి ఆపదలు ఉండవని వైఖానస ఆగమం చెబుతోంది. అసలు విష్వక్సేనుడు ఎవరో తెలుసుకుందాం!

శైవులు గణపతిని తొలిగా పూజించి అగ్రతాంబూలాన్ని సమర్పించినట్టుగానే వైష్ణవులు విష్వక్సేనుని ప్రతి కార్యంలోను పూజిస్తారు. శివ గణాలకు అధిపతి విఘ్నేశ్వరుడు అయితే, విష్ణు గణాలకు అధిపతి విష్వక్సేనుడు.

కూర్మ పురాణం ప్రకారం విష్వక్సేనుడు చూడటానికి విష్ణుమూర్తిలాగానే ఉంటాడు. ఈయనకి కూడా నాలుగు చేతులు ఉంటాయి. రెండు చేతుల్లో శంఖచక్రాలు, మూడవ చేతి చూపుడు వేలు పైకి చూపిస్తూ ఉంటుంది, నాలగవ చేతిలో గద ఉంటుంది. తన యజమాని వలె పసుపు రంగు దుస్తులు ధరించి ఉంటాడు. శ్రీ మహావిష్ణువుకు శ్రీవత్సం ఉంటే, విష్వక్సేనుడికి అవి ఉండవు. అలాగే కాళికా పురాణం, పాంచరాత్ర గ్రంథం లక్ష్మీ తంత్రం మరియు ఇతర ఆగమ గ్రంథాలలో విశ్వక్సేనుని గురించి ప్రస్తావించబడింది.

తిరుమలలో వెంకటేశ్వరస్వామి వారి ఆలయం‌లో ముక్కోటి ప్రదక్షిణంలో ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున విష్వక్సేనుడి ఆలయం ఉంది. సంవత్సరానికి వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రెండు రోజులు మాత్రమే ఈ ముక్కోటి ప్రదక్షిణ ప్రాంతాన్ని తెరిచి ఉంచడం జరుగుతుంది. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలలో ముందుగా విష్వక్సేనుని ఆరాధించడంతో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఈయన కాంస్య చిహ్నాన్ని ఆలయ ప్రాంగణం చుట్టూ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా తీసుకువెళతారు. ఈ విధంగా చేయడం వలన విష్వక్సేనుడు ఉత్సవానికి తగిన ఏర్పాట్లు చేస్తాడని మరియు ఉత్సవాలు సజావుగా జరిగేలా చూస్తాడని భక్తులు నమ్ముతారు.

తిరుమలలోనే కాకుండా వైష్ణవ ఆలయాలు శ్రీరంగం‌లోని రంగనాథ ఆలయం, కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ దేవాలయాలలో కూడా విష్వక్సేనుకి ప్రముఖ స్థానం కలదు. శ్రీరంగం దేవాలయ ఉత్సవాల్లో ప్రధాన ఊరేగింపు ప్రారంభానికి ముందు వీధులను పరిశీలిస్తున్నట్లుగా విష్వక్సేనుని ఊరేగిస్తారు. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ దేవాలయం యొక్క ఆలయ ఉత్సవం బ్రహ్మోత్సవాలకు ముందు రోజున విష్వక్సేనుని ఊరేగింపుతో ప్రారంభమవుతుంది, దీనిని సేన ముదలియార్ అని పిలుస్తారు

సర్వసైన్యాధిపతి అయిన విష్వక్సేనున్ని ఎవరైతే ఆరాధిస్తారో, వారికి ఎలాంటి విఘ్నాలు, ఆపదలు, కష్టాలు కలుగవని వైఖానస ఆగమం చెబుతోంది.

Monday, September 27, 2021

శివాష్టోత్తరం

ఓం శివాయ నమ:
ఓం మహేశ్వరాయ నమ:
ఓం శంభవే నమ:
ఓం పినాకినే నమ:
ఓం శశిరేఖరాయ నమ:
ఓం వామదేవాయ నమ:
ఓం విరూపాక్షాయ నమ:
ఓం కపర్దినే నమ:
ఓం నీల లోహితాయ నమ:

ఓం శంకరాయ నమ:
ఓం శూలాపాణినే నమ:
ఓం ఖట్వాంగినే నమ:
ఓం విష్ణువల్లభాయ నమ:
ఓం శిపివిష్టాయ నమ:
ఓం అంబికానాథాయ నమ:
ఓం శ్రీకంఠాయ నమ:
ఓం భక్తవత్సలాయ నమ:
ఓం భవాయ నమ:

ఓం శర్వాయ నమ:
ఓం త్రిలోకేశాయ నమ:
ఓం శితికంఠాయ నమ:
ఓం శివాప్రియాయ నమ:
ఓం ఉగ్రాయ నమ:
ఓం కపాలినే నమ:
ఓం కౌమారినే నమ:
ఓం అంధకాసురసూదనాయ నమ:
ఓం గంగాధరాయ నమ:

ఓం లలాటాక్షాయ నమ:
ఓం కాల కాలాయ నమ:
ఓం కృపానిధయే నమ:
ఓం భీమాయ నమ:
ఓం పరశుహస్తాయ నమ:
ఓం మృగపాణివే నమ:
ఓం జటాధరాయ నమ:
ఓం కైలాసవాసినే నమ:
ఓం కవచినే నమ:

ఓం కఠోరాయ నమ:
ఓం త్రిపురాంతకాయ నమ:
ఓం వృషాంకాయ నమ:
ఓం వృషభారూఢాయ నమ:
ఓం భస్మోద్దూళితవిగ్రహాయ నమ:
ఓం సామప్రియాయ నమ:
ఓం సర్వమయాయ నమ:
ఓం త్రయీమూర్తయే నమ:
ఓం అనీశ్వరాయ నమ:

ఓం సర్వజ్ఞాయ నమ:
ఓం పరమాత్మాయ నమ:
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ:
ఓం హవిషే నమ:
ఓం యజ్ఞమయాయ నమ:
ఓం సోమాయ నమ:
ఓం పంచవక్త్రాయ నమ:
ఓం సదాశివాయ నమ:
ఓం విశ్వేశ్వరాయ నమ:

ఓం వీరభద్రాయ నమ:
ఓం గణనాథాయ నమ:
ఓం ప్రజాపతయే నమ:
ఓం హిరణ్యరేతాయ నమ:
ఓం దుర్ధర్షాయ నమ:
ఓం గిరీశాయ నమ:
ఓం అనఘాయ నమ:
ఓం భుజంగభూషణాయ నమ:
ఓం భర్గాయ నమ:

ఓం గిరిధన్వినే నమ:
ఓం గిరిప్రియాయ నమ:
ఓం కృత్తివాసాయ నమ:
ఓం పురారాతయే నమ:
ఓం భగవతే నమ:
ఓం ప్రమధాధిపాయ నమ:
ఓం మృత్యుంజయాయ నమ:
ఓం సూక్ష్మతనవే నమ:

ఓం జగద్వ్యాపినే నమ:
ఓం జగద్గురవే నమ:
ఓం వ్యోమకేశాయ నమ:
ఓం మహాసేనజనకాయ నమ:
ఓం చారువిక్రమాయ నమ:
ఓం రుద్రాయ నమ:
ఓం భూతపతయే నమ:
ఓం స్థాణవే నమ:
ఓం అహిర్బుధ్యాయ నమ:

ఓం దిగంబరాయ నమ:
ఓం అష్టమూర్తయే నమ:
ఓం అనేకాత్మనే నమ:
ఓం సాత్త్వికాయ నమ:
ఓం శుద్ధవిగ్రహాయ నమ:
ఓం శాశ్వతాయ నమ:
ఓం ఖండపరశవే నమ:
ఓం అజాయ నమ:
ఓం పాశవిమోచకాయ నమ:

ఓం మృడాయ నమ:
ఓం పశుపతయే నమ:
ఓం దేవాయ నమ:
ఓం మహాదేవాయ నమ:
ఓం అవ్యయాయ నమ:
ఓం హరయే నమ:
ఓం పూషదంతభేత్రే నమ:
ఓం అవ్యగ్రాయ నమ:
ఓం దక్షాధ్వర హరాయ నమ:

ఓం హరాయ నమ:
ఓం భగనేత్రభిదే నమ:
ఓం అవ్యక్తాయ నమ:
ఓం సహస్రాక్షాయ నమ:
ఓం సహస్రపాదవే నమ:
ఓం అపవర్గప్రదాయ నమ:
ఓం అనంతాయ నమ:
ఓం తారకాయ నమ:
ఓం పరమేశ్వరాయ నమ:

Monday, September 20, 2021

అర్ధ నారీశ్వర స్తోత్రము

చాంపేయ గౌరార్థ శరీరకాయై
కర్పూర గౌరార్థ శరీరకాయ
ధమిల్ల కాయైచ జటాధరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయII

కస్తూరికా కుంకుమ చర్చితాయై
చితారజః పుంజ విచర్చితాయ
కృత స్మరాయై వికృత స్మరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయII

ఝణత్క్వణత్కంకణ నూపురాయై
పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ
నమశ్శివాయై చ నమశ్శివాయII

విశాల నీలోత్పల లోచనాయై
వికాసి పంకేరుహ లోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ
నమశ్శివాయై చ నమశ్శివాయII

మందార మాలా కవితాలకాయై
కపాల మాలాంకిత కంథరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయై
కపాల మాలాంకిత కంథరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయII

అంభోధర శ్యామల కుంతలాయై
తటిత్రభా తామ్ర జటధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయII

ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై
సమస్త సంహారక తాండవాయ
జగజ్జనన్యై జగదేక పిత్రే
నమశ్శివాయై చ నమశ్శివాయII

ప్రదీప్త రత్నోజ్జ్వల కుండలాయై
స్ఫురన్మహా పన్నగ భూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమశ్శివాయై చ నమశ్శివాయII

ఏతత్పఠే దష్టక నిష్టదం యో
భక్త్వా స మాన్యోభువి దీర్ఘ జీవీ
ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం
భూయాత్సదా చాన్య సమస్త సిద్ధిః

ఇతి శ్రీ మచ్చంకరాచార్య విరచిత అర్థనారీశ్వర స్తోత్రమ్

Saturday, September 18, 2021

శ్రీ వేంకటేశ్వర అష్టోత్రం

ఓం వేంకటేశాయ నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం లక్ష్మీ పతయే నమః
ఓం అనామయాయ నమః
ఓం అమృతాంశాయ నమః
ఓం జగద్వంద్యాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ప్రభవే నమః || 9 ||

ఓం శేషాద్రినిలయాయ నమః
ఓం దేవాయ నమః 
ఓం కేశవాయ నమః 
ఓం మధుసూదనాయ నమః 
ఓం అమృతాయ నమః 
ఓం మాధవాయ నమః 
ఓం కృష్ణాయ నమః 
ఓం శ్రీహరయే నమః 
ఓం జ్ఞానపంజరాయ నమః || 18 || 

ఓం శ్రీవత్స వక్షసే నమః 
ఓం సర్వేశాయ నమః 
ఓం గోపాలాయ నమః 
ఓం పురుషోత్తమాయ నమః 
ఓం గోపీశ్వరాయ నమః 
ఓం పరంజ్యోతిషే నమః 
ఓం వైకుంఠపతయే నమః 
ఓం అవ్యయాయ నమః 
ఓం సుధాతనవే నమః || 27 || 

ఓం యాదవేంద్రాయ నమః 
ఓం నిత్యయౌవనరూపవతే నమః 
ఓం చతుర్వేదాత్మకాయ నమః 
ఓం విష్నవే నమః 
ఓం అచ్యుతాయ నమః 
ఓం పద్మినీప్రియాయ నమః 
ఓం ధరావతయే నమః 
ఓం సురవతయే నమః 
ఓం నిర్మలాయ నమః || 36 || 

ఓం దేవపూజితాయ నమః 
ఓం చతుర్భుజాయ నమః 
ఓం త్రిధామ్నే నమః 
ఓం త్రిగుణాశ్రేయాయ నమః 
ఓం నిర్వికల్పాయ నమః 
ఓం నిష్కళంకాయ నమః 
ఓం నీరాంతకాయ నమః 
ఓం నిరంజనాయ నమః 
ఓం నిరాభాసాయ నమః || 45 || 

ఓం సత్యతృప్తాయ నమః 
ఓం నిరుపద్రవాయ నమః 
ఓం నిర్గుణాయ నమః 
ఓం గదాధరాయ నమః 
ఓం శార్జగపాణే నమః 
ఓం నందకినే నమః 
ఓం శంఖధారకాయ నమః 
ఓం అనేకమూర్తయే నమః 
ఓం అవ్యక్తాయ నమః || 54 || 

ఓం కటిహస్తాయ నమః 
ఓం వరప్రదాయ నమః 
ఓం అనేకాత్మనే నమః 
ఓం దీనబంధనే నమః 
ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః 
ఓం ఆకాశరాజవరదాయ నమః 
ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః 
ఓం దామోదరాయ నమః 
ఓం కరుణాకరాయ నమః || 63 || 

ఓం జగత్పాలాయపాపఘ్నాయ నమః 
ఓం భక్తవత్సలాయ నమః 
ఓం త్రివిక్రమాయ నమః 
ఓం శింశుమారాయ నమః 
ఓం జటామకుటశోభితాయ నమః 
ఓం శంఖమధ్యోల్లసన్మంజు నమః 
ఓం కింకిణాఢ్యకరండకాయ నమః 
ఓం నీలమేఘశ్యామతనవే నమః 
ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః || 72 || 

ఓం జగద్వ్యాపినే నమః 
ఓం జగత్కర్త్రే నమః 
ఓం జగత్కాక్షిణే నమః 
ఓం జగత్పతయే నమః 
ఓం చింతితార్థప్రదాయకాయ నమః 
ఓం జిష్ణవే నమః 
ఓం దశార్హాయ నమః 
ఓం దశరూపవతే నమః 
ఓం దేవకీనందనాయ నమః || 81 || 

ఓం శౌరయే నమః 
ఓం హయగ్రీవాయ నమః 
ఓం జనార్ధనాయ నమః 
ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః 
ఓం పీతాంబరధరాయ నమః 
ఓం అనఘాయ నమః 
ఓం వనమాలినే నమః 
ఓం పద్మనాభాయ నమః 
ఓం మృగయాస్తమానసాయ నమః || 90 || 

ఓం ఆశ్వారూఢాయ నమః 
ఓం ఖడ్గధారిణే నమః 
ఓం ధనార్జనసముత్సుకాయ నమః 
ఓం ఘనసారలన్మధ్య నమః 
ఓం కస్తూరీతిలకోజ్జ్వలాయ నమః 
ఓం సచ్చిదానందరూపాయ నమః 
ఓం జగన్మంగళదాయకాయ నమః 
ఓం యజ్ఞరూపాయ నమః 
ఓం యజ్ఞభోక్త్రే నమః || 99 || 

ఓం చిన్మయాయ నమః 
ఓం పరమేశ్వరాయ నమః 
ఓంపరమార్థప్రదాయ నమః 
ఓం శాంతాయ నమః 
ఓం శ్రీమతే నమః 
ఓం దోర్దండవిక్రమాయ నమః 
ఓం పరబ్రహ్మణే నమః 
ఓం శ్రీవిభవే నమః 
ఓం జగదీశ్వరాయ నమః || 108 || 

ఇతి శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||

Monday, August 30, 2021

శ్రీకృష్ణుని భార్యలు


 

శ్రీ కృష్ణునికి రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్రాదేవి,లక్షణ అని పిలువబడే ఎనిమిది మంది భార్యలు కలరు. వీరినే “అష్టమహిషులు” అని కూడా పిలువబడుతారు.

రుక్మిణి దేవి:
విదర్భ రాజు భీష్మకుని కుమార్తె అయిన రుక్మిణి దేవి శ్రీ కృష్ణుడిని గురించి విని అతడిని ఎంతగానో ప్రేమిస్తుంది. రుక్మిణీ దేవి యిష్టానికి వారి పెద్దలు అంగీకారం తెలపగా, ఆమె సోదరుడు రుక్మి మాత్రం తన స్నేహితుడైన శిశుపాలునికిచ్చి వివాహం చేయాలని నిశ్చయించి, ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు. అయితే రుక్మిణి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుడి సహాయంతో శ్రీ కృష్ణునికి తన అభీష్టము తెలిపి ముహూర్తమునకు ముందే వచ్చి తనని చేపట్టమని సందేశాన్ని పంపుతుంది. పిమ్మట రుక్మిణీ దేవి వారి వంశములోని వారి ఆచారము ప్రకారం పెళ్ళి కుమార్తె పాణిగ్రహణానికి ముందు నగర పొలిమేరలలో ఉన్న దేవాలయానికి గౌరీ పూజకు వచ్చే సమయంలో రుక్మిణి దేవిని ఎత్తుకొచ్చి, ద్వార‌క‌లో వివాహం చేసుకుంటాడు.

జాంబవతి:
సత్రాజిత్తు అను రాజు సూర్యుడి అనుగ్రహంతో రోజుకు పదహారు బారువుల బంగారం ప్రసాదించే శమంతకమణి అనే అద్భుతమైన మణిని పొందినాడు. ఆ శమంతక మణిని తనకు ఇవ్వమని శ్రీ కృష్ణుడు కోరగా, అందుకు సత్రాజిత్తు అంగీకరించలేదు. అదే సమయంలో సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతక మణిని ధరించి వేటకు వెళ్ళగా, ఆ మణిని మాంసమని అనుకుని అతనిని ఒక సింహము చంపి మణిని తీసుకొని పోయింది. సింహము నోటిలో వున్న మణిని చూసిన జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఆ మణిని ఇచ్చాడు. శమంతక మణి ఇవ్వని కారణంగా శ్రీ కృష్ణుడే ప్రసేనుడిని చంపి, శమంతక మణిని దొంగిలించాడని అపవాదు ప్రచారం చేశారు. ఆ అపవాదు మాపుకొనుటకు శ్రీ కృష్ణుడు తన సైన్యంతో ప్రసేనుడి జాడ వెదుకుతూ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ప్రసేనుడి కళేబరం ఇంకా సింహపు అడుగు జాడలు కనిపించగా, వాటిని అనుసరిస్తూ జాంబవంతుని గుహలోకి ప్రవేశించాడు. అక్కడ జాంబవంతునితో 12 రోజులు యుద్దము చేసినాడు. యుద్ధం లో అలసిపోయిన జాంబవంతుడు శ్రీ కృష్ణుడు సాక్షాత్తు శ్రీ రాముడని తెలుసుకున్న జాంబవంతుడు మణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేసాడు.

సత్యభామ:
శ్రీ కృష్ణుడు జాంబవంతుడి దగ్గర వున్న శమంతకమణిని సత్రాజిత్తుకు ఇచ్చేను. పిమ్మట జరిగిన విషయాన్ని తెలుకొని, అనవసరమైన అపవాదు శ్రీకృష్ణునిపై వేసినందుకు సత్రాజిత్తు విచారించెను. శ్రీ కృష్ణుణ్ణి అపనిందలకి గురిచేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన కుమార్తె అయిన సత్యభామని శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహము చేసెను.

కాళింది :
సూర్యుని కుమార్తె అయిన కాళింది శ్రీ మహా విష్ణువుకు భార్య అవ్వాలని ఘోరమైన తపస్సు చేయగా ఆమె తపస్సుకు మెచ్చి కృష్ణావతారంలో ఆమె కోరిక తీర్చేనట్లుగా వరం ప్రసాదిస్తాడు. పిమ్మట ఆమె మరో జన్మ ఎత్తి శ్రీ కృష్ణుడిని వివాహం చేసుకుంటుంది.

మిత్రవింద:
శ్రీ కృష్ణుని ఐదుగురు మేనత్తలలో ఒకరైన “రాజాథిదేవి” అవంతీదేశపు రాజు జయశేనుడి భార్య. వీరి కుమారులు విందానువిందులు, మరియు కుమార్తె మిత్రవింద. తన అన్నల కోరికకి వ్యతిరేకంగా మిత్రవింద స్వయంవరంలో శ్రీ కృష్ణుని వరించి వివాహం చేసుకుంటుంది.

నాగ్నజితి:
నాగ్నజితి కోసల దేశాధిపతియైన నాగ్నజిత్తు కుమార్తె. కోసల రాజ్యములో ఏడు వృషభములు (ఎద్దులు) మదించిన ఏనుగుల వలె ప్రజలకు అపాయము చేయుచున్నవి. రాజ్యంలో ఎవ్వరును వీటిని పట్టలేకపోవడంతో నాగ్నజిత్తు ఎవరైతే ఈ వృషబాలను బంధిస్తారో వానికి తన కూతురు నిచ్చి వివాహము చేయుదునని ప్రకటించెను. శ్రీ కృష్ణుడు ఆ ప్రకటన విని ఆ వృషభాలను వధించి నాగ్నజితిని పరిణయమాడెను.

భద్రాదేవి:
శ్రీ కృష్ణుని ఐదుగురు మేనత్తలలో ఒకరైన “శృతకీర్తి (శృతసేన)” కేకయ దేశపు రాజు దృష్టకేతు భార్య. వీరికి సంతర్థనుడూ అనే కుమారుడు, భద్ర అనే కుమార్తె కలరు. పెద్దల సమక్షం‌లో భద్రాదేవిని వివాహమాడాడు.

లక్షణ (లక్ష్మణ) :
మద్ర రాజ్యానికి రాజైన బృహత్సేనుని కుమార్తె లక్షణ. ఈమెకు వివాహం చేసేందుకు తండ్రి ఒక మత్స్య యంత్రాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఆ మత్స్య యంత్రాన్ని చేధిస్తారో వానికి తన కూతురు నిచ్చి వివాహము చేయుదునని ప్రకటించెను. శ్రీ కృష్ణుడు ఆ మత్స్య యంత్రాన్ని చేధించి, స్వయంవరంలో లక్షణను వివాహం చేసుకుంటాడు.

ఈ అష్ట మహిషులే కాకుండా పదహారు వేల మంది (కొన్ని గ్రంథాలలో పదహారు వేల ఒక వంద అని ఉన్నది) కృష్ణుడి భార్యలు వున్నట్లుగా హిందూ పురాణాలు చెపుతాయి. చాలామంది అపోహపడుతున్నట్టుగా శ్రీకృష్ణుడికి ఈ పదహారు వేల మంది భార్యలతో శారీరక బంధము కలిగియుండలేదు. శ్రీ కృష్ణుడు నరకాసురున్ని వధించి, నరకాసురుని చెరలో ఉన్న పదహారు వేల మంది గోపికా స్రీలను విడిపించినాడు. "భర్త అనగా భరించువాడు" అను నానుడి ప్రకారము, ఒక పురుషుని పంచన చేరి, అతని నివాసమునందు నివసించు స్త్రీలకు అతడే భర్తగా నిర్ణయించే అప్పటి కాలమానస్థితిగతులనుబట్టి శ్రీకృష్ణునికి భార్యలుగా చెప్పబడ్డారు.

Saturday, July 24, 2021

కుబేరుని ఇతివృత్తం

బ్రహ్మ మానస పుత్రులలో ఒకడైన కుబేరుడు అష్ట దిక్పాలకులలో ఒకడు. సిరి సంపదలకు, నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు. కుబేరుడు ఒక చేతిలో గదను కలిగి వుండి, మరొక చేతితో ధనాన్ని ప్రసాదిస్తూ కనిపిస్తాడు. కుబేరుని వాహనం నరుడని కొన్ని గ్రంధాలు పేర్కొనగా, మరికొన్ని గ్రంధాలలో పొట్టెలుగా అతని ఆధీనం‌లో పద్మ, మహాపద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, వర్చస అనే నవ నిధులు ఉంటాయి.

కుబేరుడు అనగా అవలక్షణాలున్న శరీరము కలవాడు (బేరము అంటే శరీరము) అని అర్థము. పేరుకి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా, పెద్ద పొట్టతో, మూడు కాళ్ళు, ఒక కన్ను, ఎనిమిది పళ్ళతో ఉంటాడని మన పురాణాలలో చెప్పబడింది. కుబేరుని భార్య పేరు చిత్ర రేఖి. అతనికి పాంచాలికుడు, మణిగ్రీవుడు, నలకూబరుడు అనే కుమారులు మరియు మీనాక్షి అనే పుత్రిక కలదు.

సిరి సంపదలకు, నవ నిధులకు అధిపతి అయిన కుబేరుని వద్ద కలియుగ ధైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి తన వివాహం నిమిత్తము ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకున్నాడని, ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తున్నాడని భక్తుల విశ్వాసం.

కుబేరుని జన్మ వృత్తాంతం:

కుబేరుడు పూర్వ జన్మలో కాంపిల్య నగరంలో గల యజ్ఞదత్తుడు – సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు గుణనిధిగా జన్మించాడు. అతను పేరుకే గుణనిధి కాని, చెడు సావాసాల వలన దుర్వసనాలకు బానిస అయ్యాడు. ఇవి తెలిసి అతని తండ్రి ఇంటి నుండి వెళ్ళగొట్టగా, కాంపిల్య నగరం చెంతనే ఉన్న గౌతమీ నది దాటి ప్రక్క ఊరు చేరుకున్నాడు. యాదృచికంగా ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఆ ఊరి చివరనున్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి, జాగారాలు చేసి, మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. ఆకలితో ఉన్న గుణనిధి భక్తులంతా నిద్రపోయెంత వరకు వేచి వుండి, వారంతా నిద్రపోయిన తరువాత శివునికి అర్పించిన ప్రసాదాలను తిందామని గర్భ గుడిలోనికి వెళ్ళాడు. ఆ గర్బ గుడిలో చీకటిగా ఉండి ఏమీ కనిపించకపోవడంతో, తన పై వస్త్రాన్ని చించి వత్తిగా చేసి అక్కడే ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు తీసుకుని బయటకి నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి నందీశ్వరుని విగ్రహం మీద పడి, తల పగిలి చనిపోతాడు. తన ఊరి నుండి పారిపోతూ పవిత్రమయిన గౌతమీ నదీ స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, ప్రసాదాల కోసం చేసిన జాగారం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ఇవన్నీ అనుకోకుండా చేసినా, యాదృచికంగా శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించటం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. అందుకనే “జన్మానికో శివరాత్రి” నానుడి ప్రసిద్ధిగాంచినది.

గుణనిధి తరువాత జన్మలో బ్రహ్మ పుత్రుడైన పులస్య బ్రహ్మర్షి కుమారుడైన విశ్రవునికి, భరద్వాజ మహర్షి తన కుమార్తె అయిన దేవవర్ణినిలకు వైశ్రవణుడిగా పుట్టినాడు. ఈ వైశ్రవణుడే కుబేరుడు.

వైశ్రవణుడు చిన్నతనం నుండే శివ భక్తి తత్పరుడై కఠోరమైన తపస్సు చేయగా, ఆ తపస్సుకు మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమయ్యి తనని లోకపాలకునిగా, ధనాధ్యక్షునిగా ఉండే వరమిస్తాడు. కాని ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ గురించి తపస్సు చేయగా, ఆయన ప్రత్యక్షమయ్యి శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానం ప్రసాదించి, త్రికూట పర్వతం మీద, సముద్ర మధ్యభాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారనీ, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడకి వెళ్ళి ఉండమని చెపుతాడు. దానితో కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి పరిపాలించసాగాడు.

కుబేరుని సోదరులు రావణ, కుంభకర్ణులు:

కుబేరుని ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసిన పాతాళ రాక్షస రాజైన సుమాలి మరియు అతని కుమార్తె కైకసి అసూయ చెంది, కైకసికి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడయిన కుమారుడు కావలెనన్న కోరికతో విశ్రవుని ఆశ్రమానికి వెళ్ళింది. విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో, వేళ కాని వేళ కలిసినందున రావణుడు, కుంభకర్ణుడు అను రాక్షసులు మరియు విభీషణుడు అను సత్పుత్రుడు కలిగారు. ఈ విధంగా కుబేరుడు రావణాసురుడికి సోదరుడవుతాడు. రావణాసురుడు శివుని గురించి తపస్సు చేసి ఆయనను మెప్పించి అనేక వరాలు పొంది, తన వర బలంతో కుబేరుడిపై దండెత్తి లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుంటాడు.

ఓటమితో భయపడిన కుబేరుడు కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమయ్యి లంకా నగరాన్ని మించిన దివ్యభవనాలతో, అపురూపమయిన చైత్ర రథం అనే ఉద్యానవనముతో, నవ నిధులతో, మణి మాణిక్యాలతో, సర్వ సంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి ఇచ్చాడు. శివానుగ్రహంతో అలకాపురం నుండి యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యకులకి రాజుగా ఉత్తర దిక్కును పరిపాలించెను.

Saturday, June 12, 2021

సప్త ఋషులు: వశిష్ట మహర్షి


వశిష్ట మహర్షి (వసిష్టుడు) హిందూ పురాణాలలో ఒక గొప్ప ఋషి మరియు సప్త ఋషులలో ఒకడు. భారతీయ ఇతిహాసాలు, పురాణాలలో ముఖ్యంగా రామాయణ, మహాభారతాలలో ఇతని ప్రస్తావన వస్తుంది. శ్రీ రాముడు జన్మించిన సూర్య వంశానికి రాజ పురోహితుడు మరియు రామ, లక్ష్మణ, భరత శతృఘ్నులు వశిష్ట మహర్షి వద్దనే విద్యాభ్యాసం చేసినారు.

వశిష్టుని పుట్టుక:

వశిష్టుడు మిత్రా వరుణలకు జన్మించాడు. మిత్రుడంటే సూర్యుడు మరియు వరుణుడు యజ్ఞం చేస్తుండగా అప్సరస అయిన ఊర్వశి ప్రత్యక్షమవుతుంది. ఆమెను చూసిన వారి మనసు చలించి తేజస్సు జారింది. ఊర్వశి ఆ రెండు తేజస్సులను విడి విడి కుండలలో పెట్టింది. ఒక కుండలో వశిష్ఠుడు మరొక కుండలో అగస్త్యుడు పుట్టారు. మిత్రుడికీ (సూర్యుడు) వరుణుడికీ పుట్టిన వాళ్ళనే అర్థంలో వీరిద్దరినీ "మైత్రా వరుణి" అని పిలుస్తారు. అలాగే కుండలో నుండి పుట్టినందున వీరిరువురును “కుంభజులు” అని కూడా పిలుస్తారు.

విశ్వామిత్రుని వైరం:

వశిష్టుని యొక్క యజ్ఞాలకు మెచ్చిన ఇంద్రుడు కామధేనువు పుత్రిక అయిన “శబల” (నందిని అని కూడా పిలుస్తారు) అనే గోవుని ఇస్తాడు. శబల కూడా కామధేనువులాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు. క్షత్రియునిగా జన్మించిన విశ్వామిత్రుడు ఒకరోజు ఒక అక్షౌహిణి సైన్యంతో వేటకై వెళ్ళి, అలసి, వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకొంటాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరగా, విశ్వామిత్రుడు అంగీకరిస్తాడు. అప్పుడు వశిష్ఠుని ఆజ్ఞ మేరకు శబల.. మహారాజుకు, ఆయన సైన్యానికి వారికి నచ్చిన పదార్థాలు సృష్టించి, అతిథి సత్కారాలు చేస్తుంది. అది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్య చకితుడై ఆ శబలను కోరగా, వశిష్ఠుడు తిరస్కరించెను. పిమ్మట మహారాజు కోపించి శబలను రాజ్యానికి తోలుకొని పొమ్మని తన సైన్యానికి అజ్ఞాపించగా, శబల ఎదురు తిరుగుతుంది. దాంతో విశ్వామిత్రుడు, అతడి సైన్యం వెనుదిరగాల్సి వస్తుంది. పిమ్మట విశ్వామిత్రుడు విచారించి, తన దగ్గర ఉన్న శక్తులతో వశిష్ఠుని గెలవజాలనని తెలిసి, పరమశివుడి తీవ్రమైన తపస్సు చేసి, రాజర్షి అవుతాడు.

వశిష్టుని వివాహం:

వశిష్టునికి పరమ పతివ్రత అయిన అరుంధతితో వివాహమైంది. వీరికి వంద మంది కుమారులున్నారు.

హిందూ వివాహా సాంప్రదాయం ప్రకారం, వివాహానంతరం (పగలు అయిన రాత్రి అయినా ఏ సమయంలో అయినా) వధూవరులకు ఆకాశం వంక అరుంధతీ నక్షత్రాన్ని చూపించే ఆచారం చాలా ప్రాచీన కాలం నుండి సంప్రదాయంగా వస్తుంది. పతివ్రతల్లో మొదటి స్థానంలో ఉన్న ఈమె నింగిలో చుక్కలా మారి జగత్తుకు ఆదర్శంగా నిలిచింది. అందువలన పెళ్లైన జంటలు అరుంధతీ-వశిష్టుల దంపతులను ఆదర్శంగా తీసుకొని వారి దాంపత్యం సుఖమయం చేసుకోవాలని పండితులు వధూవరులకు చెబుతారు.

Wednesday, May 26, 2021

వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ విశిష్టత

హిందూ పురాణాల ప్రకారం, వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని “వైశాఖ పూర్ణిమ” అని పిలుస్తారు. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనదిగా భక్తులు భావిస్తారు.

భవిష్య పురాణం ప్రకారం అమృతం కోసము దేవతలు, రాక్షసులు మందరగిరి పర్వతాన్ని కవ్వంగా మరియు వాసుకిని తాడుగా చేసుకుని క్షీర సాగర మథనం ప్రారంభించారు. అప్పుడు మందర పర్వతం తన బరువుకు సముద్రంలో మునిగిపోవడంతో వారు శ్రీ మహా విష్ణువును ప్రార్ధించగా, వారి ప్రార్థనలు మన్నించిన శ్రీ మహా విష్ణువు కూర్మ అవతారం రూపం దాల్చి పాల సముద్రం అడుగున ఉన్న మందర పర్వతాన్ని తన వీపుపై మోస్తూ పైకి లేపాడు. కూర్మ రూపంలో శ్రీ మహా విష్ణువు అవతరించిన రోజు కాబట్టి ఈ రోజును “ కూర్మ జయంతి” అంటారు.

అలాగే శ్రీమహావిష్ణువు ప్రహ్లాదుడి కోరికపై నృసింహ‌ అవతారం దాల్చి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షించింది కుడా ఈ వైశాఖ పూర్ణిమ రోజే.


ఈ వైశాఖ పూర్ణిమ బౌద్ధులకు కూడా ఎంతో ప్రత్యేకమైన రోజు. అహింసే పరమ ధర్మమని బోధించిన మహనీయుడు బుద్ధుడు కూడా వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు ప్రాచీన భారతదేశంలో భాగమైన లుంబినీ (ప్రస్తుతం నేపాల్‌లో ఉంది)లో సిద్దార్ధునిగా జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు కులీన శాక్య వంశానికి చెందిన సుద్దోదన మహరాజు, రాణి మాయదేవి. అయితే గౌతముడు పుట్టిన కొన్ని రోజులకే ఆమె తల్లి మరణించగా, పిన తల్లి గౌతమి అనే మహిళ పెంచడం వలన గౌతముడనే పేరుతో కూడా పిలుస్తారు. యాదృచ్ఛికంగా చాలా రోజుల తరువాత వైశాఖ పూర్ణిమ నాడు సిద్ధార్థుడికి గయలోని బోధి (రావి) చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా ప్రసిద్ధిగాంచాడు. అందువల్లే వైశాఖ పూర్ణిమ “బుద్ధ పూర్ణిమ”గా ప్రసిద్ధి చెందింది. అలాగే మరొక వైశాఖ పూర్ణిమ నాడు నిర్యాణం చెందాడు.

బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా పలు బౌద్ధ క్షేత్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బోధ్ గయ మరియు వారణాసి సమీపంలో బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చిన సారనాథ్ మరియు బుద్ధుడు మరణించిన కుషినగర్‌లలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

నేటికి రెండున్నర వేల సంవత్సరములు గడిచినా ఇంకా ఈ నాటికి కూడా బుద్దుడు తన అహింస ధర్మముతో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీలంక, బర్మా, థాయ్‌లాండ్, టిబెట్, చైనా, కొరియా, వియత్నాం, మంగోలియా, భూటాన్, కాంబోడియా, నేపాల్, జపాన్ పలు దేశాల్లో బౌద్ధం విస్తరించి విరాజిల్లుతోంది.

Thursday, May 20, 2021

జరాసంధుని ఇతివృత్తం

జరాసంధుడు మహాభారతంలో ఒక విచిత్రమైన పుట్టుక కలిగినవాడు. కృష్ణుడంతటి వాడిని జయించిన వీరుడు జరాసంధుడు. భీముడు, బకాసురుడు, కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనుడు - ఈ అయిదుగురు ఒకే నక్షత్రంలో జన్మించడం వలన వీరి జాతకాల ప్రకారం వీరిలో ఎవరు ముందుగా మరొకరి చేతిలో హతమవుతారో మిగిలిన ముగ్గురు కూడా వారి చేతిలోనే మరణిస్తారు. ముందుగా బకాసురుడు పాండవులు ఏకచక్రపురంలో నివసిస్తున్న సమయంలో భీముని చేతిలో సం‌హరింపబడగా, క్రమంగా మిగిలిన ముగ్గురు భీమునిచే వధింపబడినారు.

జరాసంధుని పుట్టుక:

మగధ దేశానికి రాజైన బృహద్రధుడుకి ఇద్దరు భార్యలు. వారి వలన అతనికి సంతానము లేకపోవడంచో, బృహద్రధుడు సంతానం కొరకు చందకౌశిక అనే మహర్షిని ప్రార్ధించెను. ఆ ఋషి బృహద్రధునికి ఇద్దరు భార్యలు అని తెలియక, ఒక ఫలాన్ని ఇచ్చి దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతనం కలుగుతుందని చెబుతాడు. ఆ పండును బృహద్రధుడు తన ఇద్దరు భార్యలకు సమానంగా విభజించి తినిపించాడు. పండు సగ భాగాల్ని స్వీకరించిన ఇద్దరి భార్యలకు కొంతకాలానికి శిశువులు సగ భాగాలు జన్మిస్తారు. దిగ్భ్రాంతికి గురైన మహారాజు ఆ శిశు భాగాలను బయట పడవేసి రమ్మని తన సేవకులను ఆదేశించగా, ఆ సేవకులు బయట విసిరివేస్తారు.

ఆ రాజ్యములో జరా అనే పేరుగల ఒక రాక్షస మహిళ ఈ రెండు భాగాలను ఒకటిగా చేసి కలిపి తినడానికి ప్రయత్నించిగా, ఆ శిశువుకి ప్రాణం వచ్చి ఏడవడం మొదలుపెట్టాడు. ఆ రాక్షసి జరిగిన విషయాన్ని రాజుకి చెప్పి ఆ పిల్లాడిని అప్పగించి “అతని శరీరాన్ని విభజించి వ్యతిరేక దిశలో విసిరి వేస్తే తప్ప, ఎవరూ సంహరించలేరు” అనే వరాన్ని కూడా ప్రసాదించింది. జరా అనే రాక్షసి చేత సంధించబడ్డాడు కాబట్టి రాజు కృతజ్ఞతతో ఆ పిల్లవాడికి ‘జరాసంధుడు’ అని పేరు పెట్టుకున్నాడు.

తండ్రి అరణ్యవాసానంతరం జరాసంధుడు మగధ దేశానికి రాజయ్యాడు. సహజంగానే మల్ల యుద్ధ ప్రవీణుడైన జరాసంధుడు మహా బలవంతుడు మరియు పరమ శివ భక్తుడు. తన రాజ్యమున శత్రువులు ఎవరైనా ప్రవేశిస్తే దానంతటదే మోగే భేరీపటలము ఏర్పాటు చేసి, తన రాజ్యములో ప్రవేశించిన శత్రువులను అంతము చేసేవాడు. తన కుమార్తెలు అయిన అస్తీ, ప్రాస్తీ లిద్దరిని కంసునికిచ్చి వివాహంచేసి కంసున్ని అల్లునిగా చేసుకున్నాడు. కంసున్ని చంపిన శ్రీ కృష్ణుని సంహరించే క్రమంలో భాగంగా జరాసంధుడు పదిహేడు సార్లు యుద్ధానికి ప్రయత్నించి ఓడిపోయాడు. అంతిమంగా పద్దెనిమిదవసారి మాత్రం శ్రీ కృష్ణుని ఓడించి పగ తీర్చుకున్నాడు.

ధర్మరాజు రాజసూయ యాగము చేయుటకు నిశ్చయించుకొని శ్రీ కృష్ణునికి అగ్ర తాంబూలం అంటే మహా చక్రవర్తిగా ప్రకటించి పూజించాడు. ఈ సందర్భంగా శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం ఇవ్వడాన్ని అంగీకరించని జరాసంధుడుని సం‌హరించుటకు ధర్మరాజు కృష్ణుని సహాయం కోరెను. శ్రీ కృష్ణుడు భీమార్జునులతో కలసి బ్రాహ్మణ వేషమున జరాసంధుని వద్దకు వెళ్ళాడు. బ్రాహ్మణ భక్తి కలిగిన వచ్చిన వారిని బ్రాహ్మణులనుకొని జరాసంధుడు వారికి నమస్కరించి ఏమి కావాలో కోరుకోమన్నాడు. అంతట శ్రీ కృష్ణుడు తాము బ్రాహ్మణులం కాదని అసలు విషయం చెప్పి తమతో మల్ల యుద్ధానికి ఆహ్వానించాడు. మల్ల యుద్దం నాలుగు రోజుల పాటు భీకరంగా కొనసాగగా, భీముడు జరాసంధుని సంహరించలేకపోయాడు. శ్రీ కృష్ణుడు జరాసంధుని సంహరించడానికి సూచనగా భీమునికి కనపడేలా ఒక గడ్డి పరకను రెండు ముక్కలుగా చేసి వ్యతిరేక దిశలలో విసిరేశాడు. శ్రీ కృష్ణుని సూచనతో భీముడు జరాసం‌ధుడి శరీరాన్ని రెండు సగాలుగా చీల్చి, రెండు భాగాలను వేర్వేరు దిశల్లో విసిరి వాటిని తిరిగి కలుసుకోనివ్వకుండా చేసి సంహరించాడు. రెండు భాగాలు కలిసి ప్రాణాన్ని పొందిన జరాసంధుడు రెండుగా విడిపోయి మరణించాడు.

Tuesday, April 6, 2021

శ్రీ వేంకటేశ వజ్ర కవచ స్తోత్రమ్


నారాయణం పరబ్రహ్మ సర్వకరణ కారణమ్
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ

సహస్రశీర్షా పురుషో వేంకటేశ శ్శిరో~వతు
ప్రాణేశ: ప్రాణనిలయ: ప్రాణాన్ రక్షతు మే హరి:

ఆకాశరాట్సుతానాథ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమో~పాయోద్దేహం మేవేంకటేశ్వర:

సర్వత్ర సర్వకార్యేషు మంగాంబాజాని రీశ్వర:
పాలయేన్మాం సదా కర్మ సాఫల్యం న: ప్రయచ్చతు

య ఏతద్వజ్రకవచ మభేద్యం వేంకటేశితు:
సాయం ప్రాత: పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయ:

Monday, March 1, 2021

లింగాష్టకం

బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్ ।
జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥

దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగమ్ ।
రావణ దర్ప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥

సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగమ్ ।
సిద్ధ సురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥

కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ ।
దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 4 ॥

కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగమ్ ।
సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 5 ॥

దేవగణార్చిత సేవిత లింగం భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ ।
దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 6 ॥

అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగమ్ ।
అష్టదరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 7 ॥

సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగమ్ ।
పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 8 ॥

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ । శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥