Skip to main content

Posts

Showing posts from February 28, 2009

తేనెకన్నా తియ్యనిది: తెలుగు (ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్)

ద్రవిడ భాషల వలె కాక తెలుగుభాష మూలాణ్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, మొదటి శకం బి.సి లో శాతవాహన రాజులు సృష్టించిన "గధాశప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ ,గోదావరి మధ్య భూభాగంలో నివాసం ఉండే పెద్ద వారయి ఉంటారని నిర్ణయించ వచ్చు. అశోకుడి చారిత్రక శకానికి చెందిన బ్రాహ్మి లిపి నుంచి తెలుగు లిపి ఉద్భవించినట్టుగా నమ్ముతున్నారు. తెలుగు యొక్క తూర్పు చాళుక్యుల లిపిని వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్, మరియు బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపి తో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలనే కనిపిస్తుంది. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శకంకి చెందినది. 11వ శతాబ్దంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగులోని మొట్టమొదటి సాహిత్య కావ్యం. విజయనగర చారిత్రకశకానికి చెందిన చక్రవర్తి ...