శ్రీ కృష్ణునికి రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్రాదేవి,లక్షణ అని పిలువబడే ఎనిమిది మంది భార్యలు కలరు. వీరినే “అష్టమహిషులు” అని కూడా పిలువబడుతారు. రుక్మిణి దేవి : విదర్భ రాజు భీష్మకుని కుమార్తె అయిన రుక్మిణి దేవి శ్రీ కృష్ణుడిని గురించి విని అతడిని ఎంతగానో ప్రేమిస్తుంది. రుక్మిణీ దేవి యిష్టానికి వారి పెద్దలు అంగీకారం తెలపగా, ఆమె సోదరుడు రుక్మి మాత్రం తన స్నేహితుడైన శిశుపాలునికిచ్చి వివాహం చేయాలని నిశ్చయించి, ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు. అయితే రుక్మిణి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుడి సహాయంతో శ్రీ కృష్ణునికి తన అభీష్టము తెలిపి ముహూర్తమునకు ముందే వచ్చి తనని చేపట్టమని సందేశాన్ని పంపుతుంది. పిమ్మట రుక్మిణీ దేవి వారి వంశములోని వారి ఆచారము ప్రకారం పెళ్ళి కుమార్తె పాణిగ్రహణానికి ముందు నగర పొలిమేరలలో ఉన్న దేవాలయానికి గౌరీ పూజకు వచ్చే సమయంలో రుక్మిణి దేవిని ఎత్తుకొచ్చి, ద్వారకలో వివాహం చేసుకుంటాడు. జాంబవతి : సత్రాజిత్తు అను రాజు సూర్యుడి అనుగ్రహంతో రోజుకు పదహారు బారువుల బంగారం ప్రసాదించే శమంతకమణి అనే అద్భుతమైన మణిని పొందినాడు. ఆ శమంతక మణిని
తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు మరియు తెలుగు వారి విశిష్టతలు