Skip to main content

Posts

Showing posts from March 2, 2011

శివ రాత్రి మహత్యం

శివరాత్రి మహత్యమును తెలుపు కథలు స్కంథ పురాణమునందును లింగపురాణము నందును పెక్కు కలవు. ఈ కథ లింగపురాణము లోనిది. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు కబుర్లాడు కొంటూన్నారు. "దేవదేవేశ! పాపం భూలోకములోని మానవులు ప్రారబ్ద కర్మలతో పెక్కు బాధలను అనుభవిస్తున్నారు. ఇటువంటివారికి కఠినమయిన నియమనిష్ఠలు లేకుండా యఙ్ఞయాగాదులు జపతపఫలములు లేని సులభతరమైన ఒక వ్రతమును తెలిపి వారికి క్తిని ముక్తిని కలుగునట్లు చేయుము" అని పార్వతి అన్నది. అప్పుడు శివుడు పార్వతితో యిలా అన్నాడు."దేవి! శివరాత్రివ్రతము అనునది ఒకటి ఉంది. సర్వయఙ్ఞములకు సమానమయినది. ఉత్తమోత్తమయినది. ముక్తి ప్రదమైనది. దాని కథ చెబుతాను. పూర్వము ఒక పర్వత ప్రాంతమున ’వ్యాథు’ డనే వేటగాడు ఉండేవాడు. అతను ప్రతి ఉదయము అడవికి వేటకు వెళ్ళి సాయంకాలానికి ఏదో ఒక ’మృగము’ ను చంపి ఇంటికి తెచ్చేవాడు. దానితో అతని కుటుంబము పొట్టనింపుకుంటూ ఉండేది. ఒకరోజు అతను ఎప్పటిలా అడవికి వెళ్ళాడు. అడవి అంతా తిరిగినా అతనికి ఒక్క ’మృగము’ కంటపడలేదు. వట్టి చేతులతో యింటికి వెళ్ళటానికి మనసొప్ప లేదు. అయినా చేసేది లేక యింటికి బయలు దేరాడు. దారిలో అతనికి ఒక తటాకము కనబడింది. "ఏ మృగమై

తెలుగు లో మొట్టమొదటిగా లభించిన పద్యం.

క్రీస్తు శకం 848 వ సంవత్సరం లో పండరంగుని అద్దంకి శాసనం లోని తరువోజ పద్యం. పట్టంబు గట్టిన ప్రధమంబు నేడు బలగర్వ మొప్పంగ బై లేచి సేన పట్టంబు గట్టించి ప్రభు పండరంగు బంచిన సామంత పడువతో బోయి కొత్తముల్ పండ్రెండు గొని వేంగి నంటి గొల్చి యాత్రి భావనాంకుశ బాణ నిల్పి కట్టె దుర్గంబు గడు బయల్సేసి, కందుకూర్బెజవాడ గావించి మెచ్చి దీనికి ముందుగా ఎందరో మహానుభావులు పద్యాలు వ్రాసి ఉంటారు. అయితే శాసనాలు లభించిన మేరకు ఈ పద్యం మొదటిదిగ చరిత్రకారులు చెప్తూ ఉంటారు.