Skip to main content

Posts

Showing posts from September 12, 2018

కంచిలోని బంగారు, వెండి బల్లుల గురించి పురాణగాధ

మన ఇళ్ళలో బల్లులు తిరుగుతూ ఉంటాయి. పొరబాటున బల్లి మన మీదపడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న బంగారు బల్లిని ముట్టుకున్నవారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్పలితం ఉండదని ప్రగాఢ నమ్మకం. అదే విదంగా బల్లి శరీరం మీద పడిన వారు కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్పలితం ఉండదని కూడ ప్రజల్లో మరో నమ్మకం ఉంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. పురాణగాథ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. వారు రోజూ నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. అనంతరం దీన్ని చూసిన గౌతమమహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్‌ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్‌ ఆలయంలోనే బల్లులు రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభి...