Skip to main content

Posts

Showing posts from April 2, 2011

ఉగాది పచ్చడి

ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఉగాది పచ్చడి సేవనం తెలియజెప్పే నిజం. ‘కష్ట సుఖాలు జీవితంలో చవిచూడాలి’. కాబట్టి ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. కావాల్సిన పదార్థాలు: తగినన్ని మామిడి ముక్కలు, 2 టీ స్పూన్ల వేప పువ్వు, 100 గ్రాముల కొత్త చింతపండు, 30 గ్రాముల బెల్లం, టీ స్పూను కారం, తగినంత ఉప్పు, అరటిపండు ముక్కలు తయారీ విధానం: ముందుగా కొత్త చింతపండుని ఓ గ్లాసు నీళ్లలో వేసి నానబెట్టాలి. ఆ తర్వాత చింతపండు పులుసు పిండి ఓ గిన్నెలో వేయాలి. ఈ పులుసులో సన్నగా తరిగిన మామిడి ముక్కలు, వేప పువ్వు, కారం, ఉప్పు కలపాలి. ఆ తర్వాత దానికి బెల్లం, అరటి పండు ముక్కలు కలిపితే ఉగాది పచ్చడి సిద్ధమమైనట్లే.