Skip to main content

Posts

Showing posts from July 24, 2021

కుబేరుని ఇతివృత్తం

బ్రహ్మ మానస పుత్రులలో ఒకడైన కుబేరుడు అష్ట దిక్పాలకులలో ఒకడు. సిరి సంపదలకు, నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు. కుబేరుడు ఒక చేతిలో గదను కలిగి వుండి, మరొక చేతితో ధనాన్ని ప్రసాదిస్తూ కనిపిస్తాడు. కుబేరుని వాహనం నరుడని కొన్ని గ్రంధాలు పేర్కొనగా, మరికొన్ని గ్రంధాలలో పొట్టెలుగా అతని ఆధీనం‌లో పద్మ, మహాపద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, వర్చస అనే నవ నిధులు ఉంటాయి. కుబేరుడు అనగా అవలక్షణాలున్న శరీరము కలవాడు (బేరము అంటే శరీరము) అని అర్థము. పేరుకి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా, పెద్ద పొట్టతో, మూడు కాళ్ళు, ఒక కన్ను, ఎనిమిది పళ్ళతో ఉంటాడని మన పురాణాలలో చెప్పబడింది. కుబేరుని భార్య పేరు చిత్ర రేఖి. అతనికి పాంచాలికుడు, మణిగ్రీవుడు, నలకూబరుడు అనే కుమారులు మరియు మీనాక్షి అనే పుత్రిక కలదు. సిరి సంపదలకు, నవ నిధులకు అధిపతి అయిన కుబేరుని వద్ద కలియుగ ధైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి తన వివాహం నిమిత్తము ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకున్నాడని, ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తున్నాడని భక్తుల విశ్వాసం. కుబేరుని జన్మ వృత్తాంతం : కుబేరుడు పూర్వ జన్మలో కాంపిల్య నగరంలో గల యజ్ఞదత్తుడు –...