Skip to main content

Posts

Showing posts from February 10, 2011

ఆదిత్య హృదయం

తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్, రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్. 1 దైవతై శ్చసమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణమ్, ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః. 2 రామ! రామ! మహాబాహో! శృణు గుహ్యం సనాతనమ్, యేన సర్వా నరీన్ వత్స! సమరే విజయిష్యపి. 3 ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్, జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్. 4 సర్వమంగళ మాంగళ్యం సర్వపాపప్రణాశనమ్, చింతాశోక ప్రశమనం ఆయుర్వర్థన ముత్తమమ్. 5 రశ్మిమంతం సముద్యంతం దేవాసర నమస్కృతమ్, పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్. 6 సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః, ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. 7 ఏష బ్రహ్మో చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః, మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యాపాంపతిః. 8 పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః, వాయు ర్వహ్నిః ప్రజాఃప్రాణాః ఋతుకర్తా ప్రభాకరః. 9 ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్, సువర్ణసదృశో భానుః స్వర్ణ్యరేతా దివాకరః. 10 హరిదశ్వః సహస్రార్చిః సప్తపప్తిః మరీచిమాన్, తిమిరోన్మథనః శంభు స్త్వష్టా మార్తాండకోంశుమాన్. 11 హిరణ్యగర్భః శిశిర స్తపనో భస్కరో రవిః అగ్నిగర్భో దితేః పుత్త్రః

రధ సప్తమి

సప్త సప్తి వహ ప్రీత సప్త లోక ప్రదీప సప్తమీ సహితో దేవా గృహాణార్ఘ్యం దివాకరా! లోకబాంధవుడు, గ్రహాలకు అధిపతి, ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుని జన్మతిథి మాఘశుద్ధ సప్తమి. దీనికే రథసప్తమి అని పేరు. రథసప్తమినాటి బ్రాహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని తారకలన్నీ రథాకారం దాల్చి, సూర్యరథాన్ని తలపింప చేస్తాయని ప్రతీతి. ఈవేళ్టి నుంచి సూర్యునికి భూమి చేరువ కావడం ప్రారంభమవుతుంది. అంటే భానుడి కిరణాలు భూమికి పుష్కలంగా అందడం ఆరంభమవుతుంది. సర్వదేవమయుడైన ఆదిత్యుని ఆరాధించడం వల్ల తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. రథసప్తమినాడు స్నానం చేసేటప్పుడు సూర్యభగవానుని మనసారా స్మరిస్తూ తలపై జిల్లేడు, రేగు, చిక్కుడు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతోంది. రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైనది. అందువల్ల గురువు నుంచి మంత్రదీక్ష తీసుకోవడానికి, నోములు పట్టడానికి అనుకూలమైన రోజు. ఉపదేశం ఉన్న మంత్రాలను జపం చేయడం సత్ఫలితాలను ప్రాప్తింప చేస్తుంది. రథసప్తమినాడు సూర్యాష్టకం లేదా ఆదిత్యహృదయాన్ని 9 మార్లు పఠించి, ఆవుపేడ పిడకలను కాల్చిన నిప్పు సెగపై ఆవుపాలతో పరమాన్నం వండి, దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదించడం

వసంత పంచమి

సరస్వతిని వేదమాతగా, భారతిగా, వాగేశ్వరిగా, శారదగా మన పూర్వీకులు అభివర్ణించారు. ఇంతటి సర్వశక్తిమయమైన జగదంబను వాగ్బుద్ధి జ్ఞాన స్వరూపిణిగా భావిస్తారు. ఆ తల్లిని ఆరాధించే దినమే మాఘశుద్ధ పంచమి. ఈ రోజు సరస్వతీ పూజకు ప్రశస్తంగా చెబుతారు దీనిని వసంత పంచమి అంటారు. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. వసంత పంచమినే శ్రీపంచమి అని కూడా పిలుస్తారు. శ్రీపంచమి దక్షిణ భారతదేశంలో అంతగా ప్రచారం లేకపోయినప్పటికీ, ఈ పండుగ ఉత్తర భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను. చైత్ర శుద్ధ పంచమి నాడు వలెనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను" అని వ్రత చూడామణిలో పేర్కొనబడినది.