Skip to main content

Posts

Showing posts from November 13, 2009

తెలుగు సామెతలు...

అభ్యాసము కూసు విద్య. అచ్చిగాడి పెళ్ళిలో బుచ్చిగాడికి ఒక జంధ్యపు పోగు. అడగనిదే అమ్మైనా పెట్టదు. అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలి. అడవి కాచిన వెన్నెలలా. అడవిలో పెళ్ళికి జంతువులే పురోహితులు. అడ్డాల నాడు బిడ్డలు కానీ,గడ్డాల నాడు కాదు. అద్దం అబద్ధం చెప్పదు. అడిగే వాడికి చెప్పేవాడు లోకువ. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు. అడుక్కునే వాడికి చెప్పులు కుట్టుకునే వాడు. అడుక్కున్నమ్మకి 60 కూరలు,వండుకున్నమ్మకు ఒకటే కూర. అడుసు తొక్కనేల కాలు కడగనేల. అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం. అగ్నికి ఆజ్యం పోసినట్లు. అగ్నికి వాయువు తోడైనట్లు. అమాయకునికి అక్షింతలు ఇస్తే ఆవలకి వెళ్ళి నోట్లో వేసుకున్నాడట. అంబలి తాగేవాడికి మీసాలెత్తేవాడు ఒకడు.… అంభం లో కుంభం లా. అమ్మ కడుపు తడుముతుంది,పెళ్ళం జేబు తడుముతుంది. అందం అన్నం పెట్టదు. అందని మ్రానిపండ్లకు అర్రులు చాచుట. అంధుని ముందు అందాలేల? అందితే సిగ అందక పోతే కాళ్ళు. అంగట్లో అన్నీ ఉన్నా,అల్లుడి నోట్లో శని ఉన్నట్లు. అన్న దానం కంటే విద్యా దానం గొప్పది అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నప్రాశన నాడే ఆవకాయ పచ్చడి. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు. అన్నీ వున్న విస్తరాకు అణిగిమణిగి...