Skip to main content

Posts

Showing posts from January 1, 2022

పంచబేరాలు: తిరుమలలో కొలువై వున్న శ్రీనివాస మూర్తుల విగ్రహాలు

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి జరిగే నిత్య కైంకర్యాలన్ని ఆగమ శాస్త్ర అనుసారం జరుగుతాయి. తిరుమ‌ల గ‌ర్భాల‌యం ఆనంద నిలయంలో స్వయంవ్యక్తమైన మూలవిరాట్టుతో పాటు మరో నాలుగు శ్రీనివాస మూర్తుల విగ్రహాలు కొలువై ఉంటారు. శ్రీ వారి విగ్రహంతో పాటు ఈ నలుగురు మూర్తులు పంచబేరాలు అంటారు. బేర అంటే విగ్రహం. వీరికి మూలవిరాట్టుతో పాటు నిత్యం ప్రత్యేక పూజలు, నివేదనలు సాగుతున్నాయి. ఈ పంచబేరాలు విష్ణువు యొక్క మహారూపాలైన విష్ణువు, మహావిష్ణు, సదావిష్ణు వ్యాపి నారాయణులకు సంకేతంగా పండితులు భావిస్తారు. ధృవబేర: తిరుమల కొండపై శ్రీవారి యొక్క దివ్వ సాలిగ్రామ బింబం. ఇది స్వయంభుగా వెలిసినది. ఈ మూల‌విరాట్టుని ధృవబేర అని అంటారు. ఈ విగ్రహం తిరుమల కొండపై స్వయంగా వెలిసినట్లుగా చెపుతారు. అత్యంత శక్తి వంతమైన ఈ విగ్రహానికి నిత్యం పూజలు జరుపుతూ వారానికి ఒక్కసారి అర్చకులు ఆగమపండితులు అతి పవిత్రంగా అభిషేకాలను నిర్వహిస్తారు. ఈ స్వయంభుగా విగ్రహాన్ని కదల్చడానికి వీలు ఉండదు. అందువలన ఉత్సవాల సందర్భములలో ఊరేగింపులకు వేరే విగ్రహాలను ఉపయోగిస్తారు. కౌతుకబేర: శ్రీవారి గర్భాలయంలో మూలవిరాట్టు పాదాల వద్ద ఉండే వెండి విగ్రహాన్ని కౌత