Skip to main content

Posts

Showing posts from June 12, 2021

సప్త ఋషులు: వశిష్ట మహర్షి

వశిష్ట మహర్షి (వసిష్టుడు) హిందూ పురాణాలలో ఒక గొప్ప ఋషి మరియు సప్త ఋషులలో ఒకడు. భారతీయ ఇతిహాసాలు, పురాణాలలో ముఖ్యంగా రామాయణ, మహాభారతాలలో ఇతని ప్రస్తావన వస్తుంది. శ్రీ రాముడు జన్మించిన సూర్య వంశానికి రాజ పురోహితుడు మరియు రామ, లక్ష్మణ, భరత శతృఘ్నులు వశిష్ట మహర్షి వద్దనే విద్యాభ్యాసం చేసినారు. వశిష్టుని పుట్టుక: వశిష్టుడు మిత్రా వరుణలకు జన్మించాడు. మిత్రుడంటే సూర్యుడు మరియు వరుణుడు యజ్ఞం చేస్తుండగా అప్సరస అయిన ఊర్వశి ప్రత్యక్షమవుతుంది. ఆమెను చూసిన వారి మనసు చలించి తేజస్సు జారింది. ఊర్వశి ఆ రెండు తేజస్సులను విడి విడి కుండలలో పెట్టింది. ఒక కుండలో వశిష్ఠుడు మరొక కుండలో అగస్త్యుడు పుట్టారు. మిత్రుడికీ (సూర్యుడు) వరుణుడికీ పుట్టిన వాళ్ళనే అర్థంలో వీరిద్దరినీ "మైత్రా వరుణి" అని పిలుస్తారు. అలాగే కుండలో నుండి పుట్టినందున వీరిరువురును “కుంభజులు” అని కూడా పిలుస్తారు. విశ్వామిత్రుని వైరం: వశిష్టుని యొక్క యజ్ఞాలకు మెచ్చిన ఇంద్రుడు కామధేనువు పుత్రిక అయిన “శబల” (నందిని అని కూడా పిలుస్తారు) అనే గోవుని ఇస్తాడు. శబల కూడా కామధేనువులాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు. క్షత్రియ...