Skip to main content

Posts

Showing posts from May 20, 2021

జరాసంధుని ఇతివృత్తం

జరాసంధుడు మహాభారతంలో ఒక విచిత్రమైన పుట్టుక కలిగినవాడు. కృష్ణుడంతటి వాడిని జయించిన వీరుడు జరాసంధుడు. భీముడు, బకాసురుడు, కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనుడు - ఈ అయిదుగురు ఒకే నక్షత్రంలో జన్మించడం వలన వీరి జాతకాల ప్రకారం వీరిలో ఎవరు ముందుగా మరొకరి చేతిలో హతమవుతారో మిగిలిన ముగ్గురు కూడా వారి చేతిలోనే మరణిస్తారు. ముందుగా బకాసురుడు పాండవులు ఏకచక్రపురంలో నివసిస్తున్న సమయంలో భీముని చేతిలో సం‌హరింపబడగా, క్రమంగా మిగిలిన ముగ్గురు భీమునిచే వధింపబడినారు. జరాసంధుని పుట్టుక : మగధ దేశానికి రాజైన బృహద్రధుడుకి ఇద్దరు భార్యలు. వారి వలన అతనికి సంతానము లేకపోవడంచో, బృహద్రధుడు సంతానం కొరకు చందకౌశిక అనే మహర్షిని ప్రార్ధించెను. ఆ ఋషి బృహద్రధునికి ఇద్దరు భార్యలు అని తెలియక, ఒక ఫలాన్ని ఇచ్చి దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతనం కలుగుతుందని చెబుతాడు. ఆ పండును బృహద్రధుడు తన ఇద్దరు భార్యలకు సమానంగా విభజించి తినిపించాడు. పండు సగ భాగాల్ని స్వీకరించిన ఇద్దరి భార్యలకు కొంతకాలానికి శిశువులు సగ భాగాలు జన్మిస్తారు. దిగ్భ్రాంతికి గురైన మహారాజు ఆ శిశు భాగాలను బయట పడవేసి రమ్మని తన సేవకులను ఆదేశించగా, ఆ సేవకులు బయట విసిరివేస్