రాత్రి పూట మనం ఆకాశంలోకి చూసినప్పుడు ఒక ప్రశ్నార్థకంలా కనిపించే నక్షత్ర సమూహమే "సప్తర్షి మండలం". భారత సాంప్రదాయిక ఖగోళ విజ్ఞానం ప్రకారం అందులో ఉండేవి కేవలం నక్షత్రాలు మాత్రమే కాదని ఏడుగురు దివ్యశక్తి గల మహారుషులే సప్త ఋషులుగా అలా తారారూపంలో సంచరిస్తున్నారనీ ప్రస్తావించారు. ఈ ఏడు నక్షత్రాలను కూడా సప్తర్షులు అంటారు. కేవలం భారతీయులే కాదు! పాశ్చాత్యులు కూడా ఈ సప్తర్షి మండలాన్ని ఖగోళశాస్త్రం ప్రకారం "బిగ్ డిప్పర్ (Big Dipper)" లేదా "Ursa Major" అని అంటారు. ఒకవైపు నడి సముద్రం, చుట్టూ చిమ్మచీకటి... ఇలాంటి సందర్భంలో మన పెద్దలకు సప్తర్షి మండలం ఒక దారిని చూపించే సాధనంగా ఉండేది. సముద్రం నుంచి ఎడారి వరకూ బాటసారులకు గమ్యం వైపు నడిపించేది. ఆఖరికి ప్రళయకాలంలో సత్యవ్రతుడనే రాజు సకల జీవరాశులను పడవలోకి చేర్చినప్పుడు, అతనికి దారి చూపింది కూడా సప్తర్షి మండలమే అని చెబుతారు. బహుశా అందుకనే ఆ నక్షత్రమండలానికి సప్తర్షి హోదాను కట్టబెట్టి ఉండవచ్చు. అసలు సప్తర్షుల పేర్లు ఏమిటి అని ఖచ్చితంగా చెప్పడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే వేర్వేరు పురాణ గ్రంథాలలో వేర్వేరు సప
తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు మరియు తెలుగు వారి విశిష్టతలు