నన్నయ్య గారు ఆది కవి. వీరు మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంబించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని(అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషులు అయ్యారు. వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య గారి అడుగు జాడలను అనుసరించిన వారే. నన్నయ్య గారు రాజమహేంద్రవరం లేదా రాజమండ్రి లో వుండి ఈ మహా భారతాన్ని తెలుగులో వ్రాసినారు. తల్లి గోదావరి ఒడ్డున కూర్చోని, తన రాజయిన రాజ రాజ నరేంద్ర మహా రాజు గారికి చెప్పినదే ఈ మహా భారతము. నన్నయ గారు తెలుగు మాట్లాడేవారికి పూజనీయుడు. రాజ రాజ నరేంద్రుడు నన్నయభట్టారకుని భారతాంధ్రీకరణకు ప్రోత్సహంచినాడు. అందుకు సరియైన వ్యక్తి నన్నయభట్టు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడైన వయ్యాకరణి నన్నయ. 'ఆంధ్రభాషానుశాసనం' అనే వ్యాకరణం రచించినాడని ప్రసిద్ధి. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన
తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు మరియు తెలుగు వారి విశిష్టతలు