చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి గలవోడా! సాటిలేని జాతి - ఓట మెరుగని కోట నివురుగప్పి నేడు - నిదురపోతుండాది జైకొట్టి మెల్కోలుపు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి గలవోడా! చేయెత్తి వీర రక్తపుధార - వారబోసిన సీమ పలనాడు నీదెరా - వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవడోయి! తాండ్ర పాపయ్య గూడ నీవొడూ! చేయెత్తి కాకతీయ రుద్రమ, మల్లమాంబా, మొల్ల మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే వీరవనెతలగన్న తల్లేరా! ధీరమాతల జన్మభూమేరా! చేయెత్తి నాగర్జునుడికొండ, అమరావతీ స్థూపం భావాల పుట్టాలో - జీవకళ పొదిగావు అల్పుడను కావంచు తెల్పావు నీవు! శిల్పినని చాటావు దేశదేశాలలో! చేయెత్తి దేశమంటే మట్టి కాదన్నాడు మునుషులన్న మాట మరువబోకన్నాడు అమర కవి గురజాడ నీవాడురా! ప్రజల కవితను చాటి చూపాడురా! చేయెత్తి రాయలేలిన సీమ - రతనాల సీమరా దాయగట్టె పరులు - దారి తీస్తుండారు నోరెత్తి యడగరా దానోడా! వారసుడ నీవెరా తెలుగోడా! చేయెత్తి కల్లోల గౌతమీ - వెల్లువల కృష్ణమ్మ తుంగభద్రా తల్లి - పోంగిపొరలిన చాలు ధాన్యరాసులే పండు దేశానా! కూడు గుడ్డకు కొదవలేదన్నా! చేయెత్తి ముక్కోటి బలగమోయ్ - ఒక్కటై మనముంటే ఇరుగు పొరుగులోన - వూరు పేరుంటాది తల్లి ఒక్కతే నీకు
తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు మరియు తెలుగు వారి విశిష్టతలు