Skip to main content

Posts

Showing posts from March 3, 2009

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ!

మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్నతల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి గలగలా గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలేపండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి అమరావతి నగరి అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడునాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక నీ ఆటలేఆడుతాం - నీ పాటలే పాడుతాం జై తెలుగుతల్లీ! జై తెలుగుతల్లీ!   -శంకరంబాడి సుందరాచార్య

గోవింద నామాలు

శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా నందనందన గోవిందా నవనీత చోర గోవిందా పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురిత నివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్దనోద్దార గోవిందా దశరథనందన గోవిందా దశముఖ మర్దన గోవిందా పక్షివాహన గోవిందా పాండవప్రియ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా మత్స్యకూర్మా గోవిందా మధుసూదన హరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్దకల్కిధర గోవిందా వేణుగాన ప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా సీతానాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా దరిద్రజనపోషక గోవిందా ధర్మసంస్థాపక గోవిందా అనాథ రక్షక గోవిందా ఆపద్భాంధవ గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా కమలదళాక్ష గోవిందా

వేదములు

వేదములు నాలుగు. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వేదము. అధర్వేదమును బ్రహ్మవేదము అని కూడా అ o టారు. ఋగ్వేదము - దేవతల గుణగణాలను స్తుతిస్తు o ది. యజుర్వేదము - యజ్నములు వాటికి స్త o భ o ధి o చిన కర్మకాండలను ఫలితాలను తెలియజేస్తుంది. సామవేదము - సంగీత ప్రధానం. అధర్వణ వేదము - బ్రహ్మజ్నానాన్ని, ఔషధీ విశేషాలను, యంత్ర పరికరాల వివరాలను తెలుపుతుంది. అని వేధోక్తి. – అంటే వేదాలను మీరు కాపాడండి, అవి మిమ్ములను కాపాడతాయి. " వేధో రక్షితి రక్షిత: "

నిరవధి సుఖదా

రాగం : రవిచంద్రిక పల్లవి: నిరవధి సుఖదా నిర్మల రూప నీర్జిత మనిశాపా అనుపల్లవి: శరధి బందన నత సంక్రందన శంకరాది గీయమాన సాధు మానస సుసదన చరణం: మామవ మరకట మణినిభదేహ శ్రీమణిలోల శ్రితజన పాల భీమ పరాక్రమ భీమ కరార్చిత తామస మానవ దూర త్యాగరాజ వినుత చరణ