Skip to main content

Posts

Showing posts from September 30, 2018

సప్త ఋషులు: అగస్త్య మహర్షి

అగస్త్య మహర్షి సప్త ఋషులలో ఒకడు. భారతీయ ఇతిహాసాలు, పురాణాలలో ముఖ్యంగా రామాయణ, మహాభారతాలలో ఇతని ప్రస్తావన వస్తుంది. అగస్త్యుడు నర్మదా నది ఒడ్డున ఉన్న గరుడేశ్వర అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెబుతారు. అగస్త్యుడు చాలా భారతీయ భాషల్లో గొప్ప పండితుడు. ఋగ్వేదంలో 1.165 వ శ్లోకం నుంచి 1.191 వ శ్లోకం వరకూ అగస్త్య మహర్షి, అతని భార్య లోపాముద్రలు వ్రాసినవేనని పురాణ కథనం. ఋగ్వేదమే కాక, ఇతర వైదిక సాహిత్యం కూడా వారు వ్రాసారు. శ్రీ రాముడు అరణ్యవాసాన అగస్త్యుని దర్శించుకొన్నప్పుడు దివ్య ఖడ్గాన్ని శరాసనము ఇచ్చాడు. అంతేకాకుండా రామ రావణ యుద్ధంలో రాముడు అధైర్యపడకుండా ఆదిత్య మంత్రాన్ని ఉపదేశించి ఆదుకున్నాడు. అగస్యుని పుట్టుక: అగస్త్యుని మూలాలు పౌరాణికమైనవి. మిగిలిన ఋషులులాగా అగస్త్యుడు తల్లీ, తండ్రులకు పుట్టలేదు. సూర్యుడు (మిత్రుడు), వరుణుడు యజ్ఞం చేస్తుండగా అప్సరసైన ఊర్వశి ప్రత్యక్షమవుతుంది. ఆమెను చూసిన వారి మనసు చలించి తేజస్సు జారింది. ఊర్వశి ఆ రెండు తేజస్సులను విడి విడి కుండలలో పెట్టింది. ఒక కుండలో వసిష్ఠుడు మరొక కుండలో అగస్త్యుడు పుట్టారు. కుండలో నుండి పుట్టినందున అగస్త్యునికి "కు...