Skip to main content

Posts

Showing posts from December 6, 2010

కార్తీకమాసంలో దీపదానం

న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్‌ నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరం! కార్తీక మాసమంత పవిత్ర మాసం లేనేలేదని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నదీస్నానం ఆచరించి, నదీస్నానం లభ్యం కాకపోతే లభ్యమైన జలాలతోనే సాన్నం ఆచరించి, 'కార్తీక దామోదర ప్రీత్యర్ధం అని విష్ణువుని పూజిస్తే విశేష ఫలం లభిస్తుంది. అదేవిధంగా శివాలయంలో దీపా రాధన చేస్తే చాలా మంచిది. శరత్‌ రుతువులో చంద్రుడు పూర్ణిమ నాడు 'కృత్రికా నక్షత్రం దగ్గరగా రావడం వల్ల ఈ మాసం కార్తీకమాసంగా పిలువబడుతుంది. కార్తీకమాసంలో దీపదానం ఉత్తమఫలాన్ని ఇస్తుంది. నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం కార్తీక పురాణ పఠనం, వనభోజనాలు కార్తీకమాసంలో ముఖ్యంగా జరుప వలసిన విధులు. కార్తీక మాసంలో నాగుల చవితి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీకపౌర్ణమి మొదలగు ముఖ్యమైన పండుగలు జరుపుకుంటారు. ఈ నెల రోజులు కార్తీకపురాణం రోజుకు ఒక అధ్యాయం పఠనం చేయడం వల్ల శివప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం కార్తీకమాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో దేశ వ్యాప్తంగా శివార్చనలు జరుపుతారు. శివుడు అభి షేకప్రియుడు ''అభిషేక ప్రియః శివః శివాభిష...