కూచిపూడి నృత్యము, ఈ పేరు వినని తెలుగు కళాకారుడు ఉండడు. ఇది భారతీయ నృత్యరీతులలో ప్రధానమైనది. కూచిపూడి భాగవతుల ప్రదర్శనలకు నోచుకోని గ్రామం తెలుగునాట లేదు. కూచిపూడి నృత్యరీతికి ఆద్యుడు - సిద్దేంద్ర యోగి ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో మచిలీపట్నంకు 15 మైళ్ళ దూరంలో కూచిపూడి గ్రామములో ఆవిర్భవించినది. కూచిపూడి గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది. తన పదాలతో దక్షిణ దేశాన్నంతా సుసంపన్నం చేసిన క్షేత్రయ్య స్వగ్రామమైన మువ్వ గ్రామంలో 500 సంవత్సరాలకు పూర్వమే నాట్య కళకు అంకురార్పణ జరిగినట్లు చారిత్రాకాధారాలున్నాయి. ఇది ప్రాచీన ఆంధ్ర చరిత్రాత్మక నగరమైన (క్రీ పూ 2వ శతాబ్దం) శ్రీకాకుళంకు ఆరు మైళ్ళ దూరంలో ఉన్నది. శాతవాహనులు ఈ కళకు గొప్ప ఆరాధకులుగా ప్రసిద్ధి గాంచారు. అప్పట్లో అత్యంత పవిత్ర దేవాలయమైన ఆంధ్ర విష్ణు దేవాలయం ఆవరణలో లభ్యమైన శాసనాల ప్రకారం దాదాపుగా మూడు వందల మంది దేవదాసీలు రాజమర్యాదలు అందుకునేవారు. ఇక్కడ లభ్యమైన శిల్పాలు కూడా ఆ నృత్య కళాకారిణుల దైవపూజగా భావించే అపురూప భంగిమలను దాచిపెట్టినట్లు కనిపిస్తాయి. చాలాకాలం వరకు కూచిపూడి నృత్యం దేవాలయాల్లో ప్రదర్శింపబడేది. ఇందుకు ఆధారం 1502నాటి మచ్చ
తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు మరియు తెలుగు వారి విశిష్టతలు