వసంత కాలంలో వచ్చే పండుగను రంగుల పండుగ, హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవముగా దేశ వ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. హోలీ పండుగ పుట్టుపూర్వోత్తరాల గురించి విభిన్నగాథలు ప్రచారంలో ఉన్నాయి. ఉత్తర భారతంలో ప్రధాన ఆహారధాన్యమైన గోధుమలు కోతకు వచ్చే తరుణం. ఆ కోతల కోలాహలమే- హోహోకారమే హోలీ అయిందని కొందరి అభిప్రాయం. హోలీ పండుగను భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథురా, బందావన్, నందగావ్ మరియు బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. బాలకృష్ణుని ఫాల్గుణ మాసం పూర్ణిమ తిధినాడు ఊయలలో (డోలికలో) వేసినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల బెంగాలు రాష్ట్రంలో ఈ రోజును శ్రీకృష్ణుని ప్రతిమను డోలీకలోవేసి ఊపుచూ డోలికోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. అలాగే దక్షయక్ష సమయందు అగ్నికి ఆహుతి అయిన సతీదేవి హిమవంతుని కూతురుగా జన్మిస్తుంది. ఆమెకు దక్షుడు పార్వతి అను నామధేయము చేస్తారు. సతీదేవి వియోగ దుఃఖముతో పరమేశ్వరుడు నిరంతర తపోదీక్షలో నిమగ్నమై ఉంటాడు. అట్టి స్వామికి భక్తి భావముతో పార్వతి అనునిత్యము పూజించి సపర్యలు చేస్తూ ఉంటుంది. దేవతలు పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణము చేయదలచి మన్మధుని ఆశ్రయిస్తారు. మన్మధుడు అట్టి దేవక...
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, మరియు భారతీయ పురాణాలపై లోతైన అవగాహన. ఈ బ్లాగ్, తెలుగు ప్రజల సంప్రదాయాలు, చరిత్ర, మరియు పురాణాలను సులభంగా అందిస్తుంది.