ఆంధ్రమాత ముద్దు బిడ్డలైన మహా పురుషులలో ఒకరు పొట్టి శ్రీరాములు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవియైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు సదా:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు వారి తల్లిదండ్రులు గురవయ్య, మహాలక్ష్మమ్మ. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పడమటిపాలెం గ్రామం. పేదరికం వలన వారు మద్రాసు సమీపంలో పొన్నేరి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఆర్ధికంగా వెసులుబాటు దొరకటంతో మద్రాసులోని జార్జిటౌను, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటికి చేరారు. అక్కడే 1901 మార్చి 16న పొట్టి శ్రీరాములు జన్మించారు. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. అతని జీతం వెలకు 250 రూపాయలు. 1928లో వారికి కలిగిన బిడ్డ
తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు మరియు తెలుగు వారి విశిష్టతలు