Skip to main content

Posts

Showing posts from July 3, 2017

ఆషాడంలో నవ వధూవరుల వియోగానికి కారణం ఉంది

ఆషాఢం అనగానే ఈ కాలం వారికి గుర్తొచ్చే విషయం క్లాత్‌ మార్కెట్స్‌ ఇచ్చే డిస్కౌంట్స్‌. ఈ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. వర్షాకాలానికి శ్రీకారం చుట్టేది ఈ మాసమే. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యేవి ఇప్పుడే. ఎన్నో పండుగలు మొదలయ్యేది ఈ మాసంలోనే. ఇలా ఎన్నో విశిష్టతలున్న ఆషాఢం గురించి మరిన్ని విశేషాలు మీరూ తెలుసుకోండి. మన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేక ఉంది. భారతీయ నెలల పేర్లు చంద్రుని ప్రయాణాన్ని అనుసరించి ఏర్పాటయ్యాయి. చంద్రుడు పూర్వాషాడ, ఉత్తరాషాడ నక్షత్రంలో సంచరిస్తాడు. కాబట్టి ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు వచ్చింది. వర్షాలు జన జీవనానికి హర్షం. నీరు అనేది అమృత తుల్యం. నీరు లేనిదే పంటలు పండువు. తిండి ఉండదు. అటు వంటి వర్షాకాలానికి శ్రీకారం చుట్టేది ఆషాఢ మాసమే. ఈ నెల నుంచే వర్షంతో పాటు వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో పాటు దక్షిణ యాణం వర్షాకాలం ప్రారంభం అవుతుంది. అలాగే ఈ నెలలో పాద రక్షలు, గొడుగు, ఉప్పు ధానం చేయాలట. పైగా దక్షిణ యానం పితృ దేవతలకు ప్రీతికరమని అందుకే తర్పణాలు వదిలితే ఎంతో పుణ్యం వస్తుంది. వధూవరుల వియోగం పెళ్లయ