హిందూ పురాణాల ప్రకారం అప్సరసలు మిక్కిలి అందమైన వారు. వీరు స్వర్గాధిపతి ఇంద్రుని సభ అమరావతిలో దేవతలను తమ నాట్యగానాలతో అలరించడానికి నియమింపబడ్డారు. వీరు సప్త గణాలలో ఒక వర్గము. ఆ సప్తగణాలు: (1) ఋషులు, (2) గంధర్వులు, (3) నాగులు, (4) అప్సరసలు, (5) యక్షులు, (6) రాక్షసులు, (7) దేవతలు. మన పురాణాల ప్రకారం అప్సరసలు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి, సహజన్య, నిమ్లోచ, వామన, మండోదరి, సుభోగ, విశ్వాచి, విపులానన, భద్రాంగి, చిత్రసేన, ప్రమోచన, ప్రమ్లోద, మనోహరి, మనోమోహిని, రామ, చిత్రమధ్య, శుభానన, సుకేశి, నీలకుంతల, మన్మదోద్దపిని, అలంబుష, మిశ్రకేశి, ముంజికస్థల, క్రతుస్థల, వలాంగి, పరావతి, మహారూప, శశిరేఖ. అప్సరసల పుట్టుక గురించి రకరకాల కథలు ఉన్నాయి. పూర్వం బ్రహ్మ దేవుని పిరుదుల్లో నుంచి కొందరు రాక్షసులు జన్మించారు. వీరంతా బ్రహ్మ దేవుని వెంట పడగా, బ్రహ్మ దేవుడు తన శరీరాన్ని వదిలిపెట్టి ఆనందంతో తన చేతిని వాసన చూసుకోవడంతో అప్సరసలు పుట్టారని ఒక కథనం ఉంది. అలాగే ఇంకొక కథనం ప్రకారము దేవ దానవులు అమృతం కోసం క్షీర సాగరాన్ని చిలికే సందర్భంలో అప్సరసలు పుట్టారని చెపుతారు. వీరు అందంలో దేవతలను మించి పోతారన
తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు మరియు తెలుగు వారి విశిష్టతలు