Skip to main content

Posts

Showing posts from February 21, 2011

తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది

తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ నాది … రాయలసీమ నాది … సర్కారు నాది … నెల్లూరు నాది .. అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా.. తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా యాసలు వేరుగ ఉన్నా ..మన భాష తెలుగు భాషన్నా వచ్చిండన్నా …. వచ్చాడన్నా … ఆ ….. వచ్చిండన్నా …. వచ్చాడన్నా పరాల తెలుగు ఒకటేనన్నా … తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో భాగవతం పుట్టింది ఏకశిలానగరంలో ఈ రెంటిలోన ఏది కాదన్న ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది మూడు కొండలు కలిపి దున్నినా ముక్కారు పంటలుబండ్లకెత్తినా అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం . ఐదు కోట్ల తెలుగువారిది తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జంచాము స్వతంత్ర భారత్ కి జై గాంధీ, నెహ్రూల పిలుపునందుకుని సత్యాగ్రహాలు చేసాము వందేమాతరం .. వందేమాతర

చిరస్మరణీయుడు : సి.పి.బ్రౌన్

తెలుగు సాహిత్యానికి పునప్రతిష్ఠ చేసిన మహోన్నత వ్యక్తిగా సి.పి.బ్రౌన్. 1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి నేటి వైభవానికి కారణభూతుడైన బ్రౌన్‌ను అభిమానించని తెలుగువాడు ఉండడు. దేశం నలుమూలలా చెల్లాచెదురుగా పడివున్న సాహిత్య గ్రంధాలన్నింటినీ సేకరించి, విభిన్న తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న కావ్యాలను కాగితాల మీదకు ఎక్కించి, పండితుల చేత సవరింపజేసి తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడు బ్రౌన్ 1786 జూన్‌ 13న తెల్లదొరల పిల్లల కోసం ఏర్పాటు చేసిన శరణాలయానికి ఇంగ్లండు నుంచి ఉద్యోగరీత్యా సీపీ బ్రౌన్ తల్లిదండ్రులు మనదేశానికి వచ్చారు. రెవరెండ్‌ డేవిడ్‌ బ్రౌన్‌, కాలే దంపతులకు రెండో కుమారుడు సిపి బ్రౌన్‌. బ్రౌన్‌ 1798, నవంబరు 10న కోల్‌కత్తాలో జన్మించారు. సిపి బ్రౌన్‌ పూర్తి పేరు చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. 1812లో డేవిడ్‌ బ్రౌన్‌ మృతి చెందడంతో సిపిబ్రౌన్‌ తన కుటుంబంతో 14వ యేట ఇంగ్లాండుకు వెళ్లిపోయారు. ఇండియా పాలనలో పనిచేస్తూ మరణించిన వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంతో 1817లో తన 22వ యేట సిపిబ్రౌన్‌ చెన్న పట్టణoలో అడుగు పెట్టారు. వెలగపూడి కోదండరామ దంప