వేమన చరిత్ర అస్పష్టంగా ఉంది. సుమారు 1650 - 1750 మధ్య కాలములో జీవించి ఉండవచ్చు. బహుళ ప్రచారంలో ఉన్న కథనం ప్రకరం వేమన వివరాలు ఇలా ఉన్నాయి. వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వాడు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవాడని అంటారు. కానీ ఇది నిజం కాదని పరిశోధకులు తెలియజేస్తున్నారు. కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కాపు కులస్థులకు జన్మించాడని అంటున్నారు. ఇతని జన్మస్థలం పేరు "మూగచింతపల్లె" కావచ్చును. ఇతను యవ్వనంలో వేశ్యాలోలుడిగా జీవించాడు. కొంతకాలానికి విరక్తిచెంది, తపస్సు చేసి యోగిగా మారాడు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పాడు. చివరికి కడప దగ్గరి పామూరుకొండ గుహలో శార్వరి నామ సంవత్సరం శ్రీరామ నవమి నాడు సమాధి చెందాడు. వేమన సమాధి అని ఇప్పటికీ ప్రసిద్ధమైనది కదిరి తాలూకాలోని కటారుపల్లె. ఇక్కడ వేమన సమాధి ఉంది. వేమన రసవాది అని స్వర్ణవిద్య కోసం గురువులకై వెతికాడని ఐతిహ్యం ఉంది. వేమన పద్యాలలో అతని జీవితానికి సంబంధించిన క్రింది పద్యాలు ముఖ్యంగా ఉదాహరిస్తారు. నందన సంవత్సరమున; పొందుగ కార్తీకమందు బున్నమినాడీ వింధ్యాద్రి సేతువులకును, నందున నొక వీరు డేరుపడె
తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు మరియు తెలుగు వారి విశిష్టతలు