దేవెంద్రుని అమరావతిలో దేవతల ఆనందం కోసం నియమింపబడిన అప్సరసలలో రంభ ఒకరు. ఈమె మిక్కిలి అందగత్తె. రంభకు నలకుబేరుడు అంటే మిక్కిలి మక్కువ. ఆమె ఒకసారి నలకుబేరుని అంతఃపురంనకు వెళుతుండగా నలకుబేరుని సవతి కుమారుడైన రావణాసురుడు రంభను చూసి ఆమె సౌందర్యానికి మోహితుడై ఆమెను సమీపించెను. అప్పుడు రంభ “పర స్రీలను బలత్కారిస్తే నీ తల వెయ్యి ముక్కలవుతుంది” అని రావణాసురుని శపించెను. ఈ శాపం కారణంగానే రావణాసురుడు సీతా దేవిని అపహరించినా, ఎటువంటి అఘాయిత్యం చేయలేకపోయాడు. బ్రహ్మర్షి పదవి కోసం విశ్వామిత్ర మహర్షి తీవ్ర తపస్సు చేస్తుండగా, దేవెంద్రుడు భయపడి ఆ తపస్సుని భంగం కలిగించుటకు రంభను పురమాయించెను. రంభ తన ఆట పాటలతో విశ్వామిత్రుని తపో భంగం కలిగించెను. తన తపోభంగం వలన ఆగ్రహించిన విశ్వామిత్రుడు పది వేల సంవత్సరముల వరకు శిలవై ఉండమని శపించెను.
తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు మరియు తెలుగు వారి విశిష్టతలు