ముస్లింలకు అతిపవిత్రమైన మాసం రంజాన్ మాసం. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ నెల వస్తుంది. బక్రీద్ తదితర పండుగుల వచ్చినా, ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం, ముఖ్య పండుగ రంజానే. నెలవంకను చూసినప్పట్నుంచీ ప్రారంభమయ్యే ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపడతారు. దీనినే ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ అని కూడా అంటారు. అంటే ఉపవాసాన్ని విరమించడం అని అర్థం. ఈ నెలలో ముఫ్పై రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష చేపడతారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉంటారు. కనీసం నోట్లో ఊరే లాలాజలం కూడా మింగరు. సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమించి భుజిస్తారు. ఈ సందర్భంగా వారు ఖీర్ (పాయసం), బిరియానీ మామిడితో స్వీట్లు తదితరాలు చేసుకుని భుజిస్తారు. ఈ ఉపవాసాల సమయంలో ముస్లిం మతస్థులు ఇచ్చే విందునే రంజాన్ విందు అని పిలుస్తారు. రంజాన్ పండుగ నాడు ఇచ్చే విందుకు, రంజాన్ మాసంలో ఇచ్చే విందుకు మధ్య చాలా తేడాలు ఉన్నాయంటారు ముస్లిం సోదరులు. రంజాన్ నెల చివరి పది రోజుల్లో పవిత్ర గ్రంధం ఖురాన్ భూమికి చేరిందని ముస్లింల నమ్మకం. ముస్లింల క్యాలెండర్‌లోని తొమ్మిదో నెలలో ఈ రంజాన్ పండు
తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు మరియు తెలుగు వారి విశిష్టతలు