హిందూమతంలో దేవవైద్యుడు ధన్వంతరి శ్రీమహావిష్ణువు అవతారమని పురాణాల్లో వుంది. నారాయణుడికి సంబంధించిన ఇరవై ఒక్క అవతారాలను వ్యాసభాగవతం వివరిస్తుంది. క్షీరసాగరమధన సమయంలో దేవతలు, దానవులు అమృతం కోసం జోరుగా సాగరాన్ని చిలకసాగారు. ఇందులో తొలుతగా హాలాహలం రాగా ఈశ్వరుడు దాన్ని స్వీకరించి కంఠంలో వుంచుకున్నాడు. తరువాత కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, చంద్రుడు, లక్ష్మీదేవి ఇలా ఒక్కొక్కటే సాగరం నుంచి వెలువడసాగాయి. దేనికోసమైతే వారు ఆ క్రతువుని చేపట్టసాగారో, ఆ సమయం రానే వచ్చింది. పట్టుపీతాంబరాలతో, కుండలాలతో వెలిగిపోతూ ధన్వంతరి ఒక చేత అమృత భాండం, మరో చేతిలో ఆయుర్వేదశాస్త్రంతో జన్మించాడు. ధన్వంతరి సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారమే అని ఓ నమ్మిక. ధన్వంతరి అన్న శబ్దంలోనే బాధలను తొలగించేవాడు అన్న అర్థముంది. తన చేతిలో ఉన్న అమృతంతో దేవతల వ్యాధులన్నింటినీ ఒక్కపెట్టున నయం చేస్తాడట ధన్వంతరి. అందుకే ఆయనకు దేవవైద్యుడు అన్న పేరు కూడా ఉంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి క్షీరసాగరం నుంచి పుట్టినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. క్షీరసాగరంలో నుంచి ఆవిర్భవించిన ధన్వంతరి తనకు స్థిరనివాసం కల్పించాలని మహావిష్ణ
తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు మరియు తెలుగు వారి విశిష్టతలు