/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Thursday, December 10, 2009

ఆది కవి నన్నయ్య

నన్నయ్య గారు ఆది కవి. వీరు మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంబించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని(అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషులు అయ్యారు. వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య గారి అడుగు జాడలను అనుసరించిన వారే. నన్నయ్య గారు రాజమహేంద్రవరం లేదా రాజమండ్రి లో వుండి ఈ మహా భారతాన్ని తెలుగులో వ్రాసినారు. తల్లి గోదావరి ఒడ్డున కూర్చోని, తన రాజయిన రాజ రాజ నరేంద్ర మహా రాజు గారికి చెప్పినదే ఈ మహా భారతము. నన్నయ గారు తెలుగు మాట్లాడేవారికి పూజనీయుడు.
రాజ రాజ నరేంద్రుడు నన్నయభట్టారకుని భారతాంధ్రీకరణకు ప్రోత్సహంచినాడు. అందుకు సరియైన వ్యక్తి నన్నయభట్టు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడైన వయ్యాకరణి నన్నయ. 'ఆంధ్రభాషానుశాసనం' అనే వ్యాకరణం రచించినాడని ప్రసిద్ధి. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి,పందితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ నారాయణులు యుగపురుషులు. రాజరాజనరేంద్రుని పాలన కాలంలో సాహిత్యపోషణకు అనుకూలమైన ప్రశాంతవాతావరణం క్రీ.శ. 1045-1060 మధ్యలో ఉంది. ఆ కాలంలోనే భారతాంధ్రీకరణ జరిగి ఉంటుంది.
వ్యాసభారతాన్ని తెలుగులోకి తెచ్చిన ఆదికవి నన్నయ్య యథామూలానువాదం చెయ్యలేదు. శ్లోకానికి పద్యము అన్న పద్ధతి పెట్టుకోలేదు. భారత బద్ధ నిరూపితార్థము తెలుగు వారికి అందించడమే నా లక్ష్యం అన్నాడు. దానికి తగినట్టు పద్దెమినిమిది పర్వాలకూ ప్రణాళిక రచించి తన స్వేచ్ఛానువాదాన్ని ప్రారంభించాడు. తిక్కన, ఎర్రనలు అదే మార్గంలో అదే లక్ష్యంతో దాన్ని పూర్తి చేసారు. అప్పటినుంచి ప్రాచీన తెలుగు కవులు అందరికీ అదే ఒరవడి అయ్యింది. స్వేచ్ఛానువాదాలే తప్ప యథామూలానువాదాలు అవతరించలేదు (శాస్త్ర గ్రంథాలు మాత్రం దీనికి మినహాయింపు). వర్ణనల్లోనేమి రసవద్ఘట్టాలలోనేమి అనువక్త ఈ తరహా స్వేచ్ఛను తీసుకున్నా సన్నివేశాలే ఆయా రచనల్లో కాంతిమంతాలుగా భాసించడం, పాఠకులు అందరికీ అవే ఎక్కువ నచ్చడం గమనించవలసిన అంశం. భారతంలో కొన్ని ఉపాఖ్యానాలు కావ్యాలుగా విరాజిల్లడం “ప్రబంధమండలి” అనిపించుకోవడం వెనక దాగి ఉన్న రహస్యం ఇదే.
నన్నయ్య ఈ మార్గం తొక్కడానికి ఒక చారిత్రక కారణం ఉంది. పదకొండవ శతాబ్దానికి ముందే వ్యాసభారతం కన్నడంలోకి దిగుమతి అయ్యింది. అయితే అది కన్నడ భారతమే తప్ప వ్యాస భారతం కాదు. వ్యాసుడి లక్ష్యమూ, పరమార్థమూ పూర్తిగా భంగపడ్డాయి. కథాగమనమూ, పాత్రల పేర్లు మాత్రం మిగిలాయి. స్వభావాలు మారిపోయాయి. భారత రచనకు పరమార్థమైన వైదిక ధర్మం స్థానాన్ని జైన మతం ఆక్రమించింది. ఈ అన్యాయాన్ని చక్కదిద్దడం కోసం నన్నయ గంటం అందుకున్నాడు. అందుచేత భారత పరమార్థాన్ని పునఃప్రతిష్ఠించడమే సత్వర కర్తవ్యంగా స్వేచ్ఛానువాద పద్ధతిని స్వీకరించాడు. బహుశ ఇందులోని స్వేచ్ఛ అనంతర కవులను ఆకర్షించింది. స్వీయ ప్రతిభా ప్రదర్శనకు అవకాశం ఇచ్చింది. అందుచేత కథాకల్పనల కోసం వృధా శ్రమ పడకండా ప్రఖ్యాత వస్తులేశాన్ని స్వీకరించి సర్వాత్మనా స్వతంత్ర కావ్యాలను రచించారు.
ఆయన ఆంధ్ర మహాభారతము శ్రీకారము త్రిమూర్తులను స్తుతంచే ఈ సంస్కృత శ్లోకముతో జరిగినది.
"శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్శ్రేయసే"
(లక్ష్మీ సరస్వతీ పార్వతులను వక్షస్థలమునందును, ముఖమునందును, శరీరము నందును ధరించి లోకములను పాలించువారును, వేదమూర్తులును, దేవపూజ్యులును, పురుషోత్తములును అగు విష్ణువు, బ్రహ్మ, శివుదు మీకు శ్రేయస్సు కూర్తురు గాక!)
భారతాంధ్రీకరణలో ఆయన మూడు లక్షణములు తన కవితలో ప్రత్యేకముగా చెప్పుకొన్నారు.




  1. ప్రసన్నమైన కథాకలితార్థయుక్తి 

  2. అక్షర రమ్యత 

  3. నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వము.



భారతంలో నన్నయగారి చివరిపద్యం - శారదరాత్రుల వర్ణన
శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరి పూరితంబులై
(శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. - అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనుపించటము లేదు - వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలి తో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి వంటి వెన్నెలను విరజిమ్ముతున్నాడు)

Friday, November 13, 2009

తెలుగు సామెతలు...

అభ్యాసము కూసు విద్య.
అచ్చిగాడి పెళ్ళిలో బుచ్చిగాడికి ఒక జంధ్యపు పోగు.
అడగనిదే అమ్మైనా పెట్టదు.
అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలి.
అడవి కాచిన వెన్నెలలా.
అడవిలో పెళ్ళికి జంతువులే పురోహితులు.
అడ్డాల నాడు బిడ్డలు కానీ,గడ్డాల నాడు కాదు.
అద్దం అబద్ధం చెప్పదు.
అడిగే వాడికి చెప్పేవాడు లోకువ.
అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు.
అడుక్కునే వాడికి చెప్పులు కుట్టుకునే వాడు.
అడుక్కున్నమ్మకి 60 కూరలు,వండుకున్నమ్మకు ఒకటే కూర.
అడుసు తొక్కనేల కాలు కడగనేల.
అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం.
అగ్నికి ఆజ్యం పోసినట్లు.
అగ్నికి వాయువు తోడైనట్లు.
అమాయకునికి అక్షింతలు ఇస్తే ఆవలకి వెళ్ళి నోట్లో వేసుకున్నాడట.
అంబలి తాగేవాడికి మీసాలెత్తేవాడు ఒకడు.…
అంభం లో కుంభం లా.
అమ్మ కడుపు తడుముతుంది,పెళ్ళం జేబు తడుముతుంది.
అందం అన్నం పెట్టదు.
అందని మ్రానిపండ్లకు అర్రులు చాచుట.
అంధుని ముందు అందాలేల?
అందితే సిగ అందక పోతే కాళ్ళు.
అంగట్లో అన్నీ ఉన్నా,అల్లుడి నోట్లో శని ఉన్నట్లు.
అన్న దానం కంటే విద్యా దానం గొప్పది
అన్నం పరబ్రహ్మ స్వరూపం.
అన్నప్రాశన నాడే ఆవకాయ పచ్చడి.
అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు.
అన్నీ వున్న విస్తరాకు అణిగిమణిగి ఉందట..ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడ్డదట…
అన్ని దానములలొ విద్యా దానం గొప్పది
అన్ని చోట్లా బావే కానీ..వంగ తోట కాడ మాత్రం కాదు.
అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు.
అనుమానం పెనుభూతం.
అప్పిచ్చువాడు వైద్యుడు.
అర్ధరాత్రి మద్దెలదరువు.
అసలే లేదంటే పెసరపప్పు వండమన్నాడట ఒకడు.
అసలు కంటే వడ్డీ ముద్దు
అసలుకే ఎసరు పెట్టినటు.
అసమర్థుడికి అవకాశమివ్వనేల?
అతి రహస్యం బట్ట బయలు.
అత్త లేని కోడలుత్తమురాలు,కోడలు లేని అత్త గుణవంతురాలు.
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు
అత్త సొమ్ము అల్లుడు దానం.
అయిన వారికి అరిటాకుల్లో...కాని వారికి కంచాల్లో.
అయితే ఆదివారం,కాకుంటే సోమవారం.
అయ్యవారు వచ్చే వరకూ అమావాస్య ఆగుతుందా?
అయ్యకి లేక అడుక్కుని తింటుంటే,కొడుకొచ్చి కోడి పలావు అడిగాట్ట.
అయ్యవారిని చెయ్యబోతే కోతి అయ్యినట్లు.

ఆ తాను ముక్కే !!!
ఆడబోయిన తీర్థం యెదురైనట్లు.
ఆడదాని వయసు మగవాని సంపాదన అడగొద్దన్నట్టు.
ఆడది సాధించలేనిది లేదు,ముఖ్యంగా మొగుడిని.
ఆడలేక మద్దెల వోడు అన్నట్లు.
ఆడవాళ్ళకి బట్టతల రాదేమండి?..బెట్టుదల ఎక్కువగనుక.
ఆది లోనే హంస పాదు.
ఆడి తప్ప రాదు,పలికి బొంక రాదు.
ఆకాశానికి హద్దు లేదు.
ఆకలి రుచి యెరుగదు,నిద్ర సుఖం ఎరుగదు,వలపు సిగ్గెరుగదు.
ఆకలి వేస్తే రోకలి మింగమన్నాట్ట.
ఆకు ఎగిరి ముల్లు మీద పడ్డ,ముల్లు వచ్చి ఆకు మీద పడినా చిరిగేది ఆకే.
ఆలశ్యం అమృతం విషం.
ఆలు లేదు,చూలు లేదు,కొడుకు పేరు సోమలింగం అన్నట్టు.
ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ.
ఆరోగ్యమే మహాభాగ్యము.
ఆస్థి మూరెడు ఆశ బారెడు.
ఆత్రగానికి బుద్ధి మట్టము.
ఆవలింతకు అన్న ఉన్నాడు కాని,తుమ్ముకు తమ్ముడు లేడంట.
ఆవలిస్తే పేగులు లెఖ్ఖ పెట్టినట్లు..
ఆవు చేల్లో మేస్తే,దూడ గట్టున మేస్తుందా?
ఆయనే ఉంటే మంగలి ఎందుకు అని?
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.
ఆకులు నాక్కునే వాడి దగ్గర మూతులు నాక్కునే వాడట.
ఆశపోతు బ్రాహ్మడు లేచిపోతూ పప్పు అడిగాడుట.

బావిలో కప్పలా…
బంక్తిలో బాలపక్షం.
బతకలేక బడి పంతులయినట్టు..
బతికుంటే బలుసాకు తినవచ్చు.
బెల్లం చుట్టూ ఈగల్లా
బెల్లం కొట్టిన రాయిలా.
భార్యా రూపవతి శత్రు:
భక్తి లేని పూజ పత్రి చేటు.
బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ.
బోడి ముండకి మంగళ హారతి ఒకటి.
బొంకులెన్నే కోడలా అంటే-అని అనిపించుకో అత్తగారా...నీకు ఆరు నాకు మూడు అందట.
బూడిదలో పోసిన పన్నీరు.

చాదస్తపు మొగుడికి తెలీదు,చెపితే వినడు,కొడితే ఏడుస్తాడు.
చాప కింద నీరులాగ.
ఛావు కబురు చల్లగ చెప్పినట్లు.
చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు.
చచ్చినవాని కళ్ళు చారెడు.
చచ్చిన వాడి పెళ్ళికి వొచ్చిందే కట్నం.
చద్ది కూడు తిన్నమ్మ మొగుడాకలి యెరగదట.
చదవేస్తే ఉన్నమతి పోయినట్టు.
చదువు రాని వాడు వింత పశువు.
చేతకానమ్మకే చేష్టలెక్కువ.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.
చక్కనమ్మ చిక్కినా అందమే.
చల్ల కొచ్చి ముంత దాచినట్లు.
చంకలో పిల్లాడ్ని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు…
చస్తుంటే సంధ్య మంత్రమన్నాడట ఒకడు…
చెడపకురా చెడేవు.
చెముడా అంటే మొగుడా అన్నట్టు.
చెప్పే వాడికి వినే వాడు లోకువ అన్నట్టు…
చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు,దూరేవన్నీ దొమ్మరి గుడిసెలు.
చెరపకురా చెడెదవు,ఉరకకురా పడెదవు.
చెరువుకి నీటి ఆశ,నీటికి చెరువు ఆశ.
చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లు
చెవిలో జొరీగలాగ…
చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు.
చెవిటోడి పెళ్ళికి,మూగోడి కచ్చేరీ.
చిల్లర దేవుళ్ళకు చేరువయితే,అసలు దేవుడికి దూరమౌతావు.
చిన్న పామునైనా పెద్ద కర్రతోటే కొట్టాలి.
చింత చచ్చినా పులుపు చావ లేదు.
చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,ఆ వంకర టింకరవి యేమి కాయలని అడుగుతుందట.
చిత్తం శివుని పైన,భక్తి చెప్పుల పైన.
చిలికి చిలికి గాలివాన అయినట్లు.
చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు.

దాసుని తప్పు దండంతో సరి.
డబ్బేమన్నా చెట్టుకి కాస్తుందా?
డబ్బివ్వని వాడు పడవ ముందు యెక్కాడట.
డబ్బూ పోయే శని కూడాపట్టే అన్నట్టు.
డబ్బుకు లోకం దాసోహం.
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వనట్టు.
దక్కిందే దక్కుడు.
దమ్మిడి ముండకి ఏగాణి క్షవరం.
దంపినమ్మకు బొక్కిందే కూలన్నట్టు.
దండం దశగుణంభవేత్.
దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన.
దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట.
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.
దేవుడి గుదిలోనే పదిలం.బయటకు వస్తే పదలం.
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు.
దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు.
దినదిన గండం,దీర్ఘాయుస్షు.
దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు.
దొంగకు దొంగ బుద్ధి,దొరకు దొర బుద్ధి.
దొంగకు తేలు కుట్టినట్లు.
దూరపు కొండలు నునుపు.
దొరికితేనే దొంగలు,దొరక్క పొతే అందరూ దొరలే.
దున్నపోతు మీద వర్షం కురిసినట్లు.
దురాశ దుఖానికి చేటు

ఎద్దు పుండు కాకికి నొప్పా?
ఎగిరే గాలిపటానికి దారం ఆధారం.
ఎక్కడైనా బావే కానీ వంగతోట దగ్గర మాత్రం కాదు.
ఎవరు తీసిన గోతిలో వారే పడతారు
ఏనుగు బ్రతికినా వెయ్యే,చచ్చినా వెయ్యే.
ఏ చెట్టూ లేని చోట ఆముదము చెట్టే మహా వృక్షం.
ఏ ఎండకు ఆ గొడుగు.

గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే,ఒంటె అందానికి గాడిద మూర్చ పోయిందట.
గాజుల బేరం భోజనానికి సరి.
గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టు.
గాలికిపోయే దానిని గుండుకి చుట్టుకున్నట్లు.
గంతకు తగ్గ బొంత.
గతి లేనమ్మకు గంజే పానకము.
గోరు చుట్టు మీద రోకలి పోటు.
గోడ మీద రాసుకున్న రేపు ఎప్పటికీ రాదు
గోడ మీది పిల్లి వాటం.
గోడలకు చెవులుంటాయి.
గొడ్డుని చూసి గడ్డెయ్యాలి.
గోముఖ వ్యాఘ్రం.
గొంతెమ్మ కోరికలు.
గోటితో పొయ్యేదానికి గొడ్డలి వాడినట్టు.
గుడ్డి కన్నా మెల్ల మేలు.
గుడ్డెద్దు జొన్న చేల్లో పడినట్లు.
గుడ్డోచ్చి పిల్లని వెక్కిరించినట్లు.
గుడ్డి కన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే.
గుడి మింగే వాడికి నంది పిండిమిరియం.
గుడిని గుడిలో లింగాన్ని మింగినట్లు.
గుడ్ల మీద కోడిపెట్టలాగ.
గుంభనం గునపం లాంటిది,బయటే వాడుకోవాలి,కడుపులో వుంటే పోట్లు పొడుస్తుంది.
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట.
గుర్రం గుడ్డిదైనా దాణాకి లోటు లేదు.
గురువుకి పంగనామాలు పెట్టినట్లు.
గురువును మించిన శిష్యుడు.

ఇంట గెల్చి రచ్చ గెలువమన్నారు.
తిన్నింటి వాసాలు లెఖ్ఖపెట్టినట్లు.
ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు.
ఇంటి పేరు కస్తూరివారు ఇంట్లో గబ్బిలాల కంపు.
ఇంటికన్నా గుడి పదిలం.
ఇంట్లో చూరు కింద నీళ్ళు తాగి,బయటకొచ్చి చల్ల తాగామని చెప్పుకున్నట్టు.
ఇంట్లో ఈగల మోత బైట పల్లకీ మోత.
ఇస్తే హిరణ్య దానం,ఇవ్వక పొతే కన్యాదానం.
ఇసుక తక్కెడ పేడ తక్కెడ.
ఐశ్వర్యం వస్తే అర్థ రాత్రి గొడుగు పట్టమనేవాడు.

జోగీ జోగీ రాసుకుంటే రాలేది బూడిదే.
జుత్తు వున్న అమ్మ యే కొప్పైనా పెడుతుంది.

కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు.
కాగలకార్యం గంధర్వులే తీర్చినట్లు.
కాకి ముక్కుకు దొండపండు.
కాకి పిల్ల కాకికి ముద్దు.
కాకిలా కలకాలం బ్రతికేకన్నా,హంసలా ఆరు నెలలు బ్రతికితే చాలు.
కాలం కలిసి రాకపొతే,కర్రే పామై కాటు వేస్తుంది.
కాలికేస్తే మెడకి,మెడకేస్తే కాలికి.
కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేము.
కాషాయం కట్టిన వాళ్ళందరూ సన్యాసులు కారు,కషాయం మింగినవాళ్ళందరికీ కఫం కరగదు.
కాయా...పండా?
కధ కంచికి మనం ఇంటికి.
కడుపా?కళ్ళేపల్లి చెరువా?
కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు.
కలకాలపు దొంగైనా ఏదో ఒకనాడు దొరుకుతాడు.
కలిమిలేములు కావడి కుండలు.
కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడన్నట్టు.
కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్లు.
కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టినట్టు…
కంచే చేను మేసినట్లు.
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా!
కందకులేని దురద కత్తి పీటకెందుకు?
కడవంత గుమ్మడికాయ కత్తి పీటకు లోకువ.
కందెన వేయని బండికి కావాల్సినంత సంగీతం.
కరవమంటే కప్పకు కోపం,విడవమంటే పాముకు కోపం.
కర్ర ఇచ్చిమరీ పళ్ళు రాలకొట్టించు కోవడం.
కష్టే ఫలే..
కట్టె కొట్టె తెచ్చె…
కయ్యానికి కాలు దువ్వడం.
కీడెంచి మేలెంచమన్నారు.
కొడితే ఏనుగు కుంభస్థలం మీద కొట్టాలి.
కొంప కొల్లేరు అయ్యింది.
కొనబోతే కొరివి అమ్మబోతే అడివి.
కొండనాలిక్కి మందేస్తే ఉన్ననాలిక ఊడినట్లు.
కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచులా కరిగినట్లు.
కొండను తవ్వి యెలుకను పట్టినట్లు.
కూటికి పేదైతే కులానికి పేదా?
కొప్పున్నమ్మ కోటి ముడులు వేస్తుంది.
కొరకరాని కొయ్యలా.
కొరివితో తల గోక్కోవడం.
కోతిపుండు బ్రహ్మరాక్షసి.
కోతికి కొబ్బరిచిప్ప ఇచ్చినట్లు.
కొత్తొక వింత...పాతొక రోత.
కోటివిద్యలు కూటి కొరకే.
కొత్త అప్పుకు పోతే పాత అప్పు బయటపడ్డదట.
కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు.
కృషితో నాస్తి దుర్భిక్షం.
క్షేత్రమెరిగి విత్తనం పాతాలి,పాత్రమెరిగి దానము చెయ్యాలి.
కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టిందట.
కుడుము చేతికిస్తే పండగ అనేవాడు.
కుక్క కాటుకు చెప్పు దెబ్బ.
కుక్క వస్తే రాయి దొరకదు,రాయి దొరికితే కుక్క రాదు.
కుక్షిలో అక్షరం ముక్క లేదు కానీ...
కుళ్ళు ముండకి అల్లంపచ్చడి అన్నట్టు.
కుంచమంత కూతురుంటే అన్నీ మంచెలోనే.

లేని దాత కంటే ఉన్న లోభి నయం.
లోగుట్టు పెరుమాళ్ళకెరుక.

మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్లు.
మాటలు చూస్తే కోటలు దాటుతాయి.
మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అందట.
మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో.
మంచి వాడు మంచి వాడు అంటే...మంచమెక్కి గంతులేసాడుట.
మంచికి పొతే చెడెదురైనట్లు.
మంచిమాటకు మంది అంతా మనవాళ్ళే.
మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు.
మందుకి పంపితే మాసికానికి వచ్చాడట.
మనిషి మర్మము,మాని చేవ బయటకు తెలియవు.
మనిషికి మాటే అలంకారం.
మనసుంటే మార్గముంటుంది.
మంచిమనిషికొక మాట-గొడ్డుకొక దెబ్బ.
మనిషికొక తెగులు మహిలోసుమతీ.
తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్టు.
మంత్రాలకు చింతకాయలు రాలవు.
మంత్రాలు తక్కువ తుంపర్లు ఎక్కువ.
బోడి సంపాదనకు ఇద్దరు పెళ్ళాలా?
మేకవన్నె పులి.
మెరిసేదంతా బంగారం కాదు.
మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట.
మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె!
మొదటికే మోసం
మొదట భోగి,భోగాలెక్కువై రోగి,రోగాలు భరించలేక యోగి.
మొగుడ్ని తన్ని మొగసాలకెక్కిందట.
మొగుడు కొట్టినందుకు కాదు,తోడికోడలు దెప్పినందుకు.
మొహమటానికి పొతే కడుపు అయ్యిందట.
మొక్కై వంగనిది మానై వంగునా?
మొండి వాడు రాజు కన్నా బలవంతుడు…
మూల విగ్రహానికి లేక ఈగలు తోలుకుంటుంటే,ఉత్సవ విగ్రహాలు వచ్చి వూరేగింపు ఎప్పుడు అన్నాయట.
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు.
మూణ్ణాళ్ళ ముచ్చట.
మొరటోడికి మొగలి పువ్విస్తే మడిచి ముడ్లో పెట్టుకున్నాడట.
మొరిగే కుక్క కరవదు.
మోసేవానికే తెలుస్తుంది కావడి బరువు.
ముడ్డి మీద తంతే మూతి పళ్ళు రాలినట్టు.
ముక్కు పట్టుకోమంటే బ్రాహ్మడి ముక్కు పట్టుకున్నాడట.
ముక్కు మీద కోపం.
ముక్కు సూటిగా పోవడం.
ముళ్ళ కంప మీద పడిన గుడ్డలా…
ముల్లును ముల్లుతోటే తియ్యాలి,వజ్రాన్ని వజ్రం తోటే కొయ్యాలి.
ముండా కాదు,ముత్తైదువా కాదు.
ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు.
ముందుకు పోతే గొయ్యి-వెనుకకు పోతే నుయ్యి.
ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి.
ముందుంది ముసళ్ళ పండగ.
ముంజేతి కంకణానికి అద్దం యెందుకు?
ముసలాడికి దసరా పండగన్నట్లు.

నారు పోసిన వాడే నీరు పోస్తాడు.
నడమంత్రపు సిరి నరం మీద పుండు నిలబడనియ్యవు.
నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో,నీ మాటలో అంతే నిజం ఉంది.
నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.
నాట్యం చెయ్యవే రంగసానీ అంటే నేల వంకర అందట.
నవ్వే ఆడదాన్ని,ఏడ్చే మగవాడ్ని నమ్మ కూడదు.
నవ్విన నాప చేనే పండుతుంది.
నవ్వు నాలుగు విధాల చేటు.
నవ్వులు పోయి నువ్వులౌతాయి.
నీ చెవులకు రాగి పోగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు.
నీ కంటి పొరలు తొలగించి చూడు,అందరి లోనూ మంచినే చూడగలవు.
నీ నెత్తి మీద ఏదో ఉంది అంటే అదేదో నీ చెత్తోనే తీసెయ్యి అన్నాడట.
నీ ఎడమ చెయ్యి తియ్యి నా పుర్ర చెయ్యి పెడతానన్నాడట ఒకడు…
నాకోడి కూస్తేకాని తెల్లవారదన్నట్టు.
నీరు పల్ల మెరుగు,నిజము దేముడెరుగు.
నిదానమే ప్రధానం.
నిజం నిలకడ మీద తెలుస్తుంది.
నిజం నిప్పు లాంటిది.
నిమ్మకు నీరెత్తినట్లు.
నిండా మునిగిన వానికి చలి యేమిటి?
నిండు కుండ తొణకదు
నిన్నటి అబద్ధాన్ని ఇవ్వాల్టి నిజంతో కప్పి పుచ్చలేము.
నిప్పు ముట్టనిది చెయ్యి కాలదు.
నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒక్కటే గాలిపెట్టు.
నోరు మంచిదైతే ఊరు మంచిది.
నువ్వు ఎక్కాల్సిన రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం ఆలస్యం,అది దేవుడు నీ జీవితంపై వేసిన వేటు.
నువ్వు మేకని కొంటే నేను పులిని కొని నీ మేకని చంపిస్తా అన్నాడట.

ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న....ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు.
ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెళ్ళాడాట్ట.
ఒంటి పూట తిన్నమ్మ ఓర్చుకుంటే,మూడు పూటలు తిన్నమ్మ మూర్చ పోయిందట.
ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి.
ఊపిరి ఉంటే ఉప్పమ్ముకుని బ్రతకవచ్చు.
ఊరక రారు మహానుభావులు.
ఊరంతా చుట్టాలేకాని ఉట్టికట్ట తావు లేదు.
ఊరు మొహం గోడలు చెపుతాయి.
ఊరు పొమ్మంటోంది కాడు రమ్మంటోంది.
ఊరుకున్నంత ఉత్తమం లేదు,బోడి గుండంత సుఖం లేదు.
ఒట్టు తీసి గట్టున పెట్టు.

పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరీ.
పాకీ దానితో సరసం కంటే అత్తరు సాయబ్బు తో కలహం మేలు.
పాము కాళ్ళు పామున కెరుక.
పానకంలో పుడకలాగ.
పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట.
పాపి చిరాయువు
పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్లు.
పదుగురాడు మాట పాడియై చెల్లు.
పక్కలో బల్లెం లాగ.
పండగనాడు కూడా పాత మొగుడే అన్నట్లు.
పంచ పాండవులు ఎంత మంది అని అడిగితే మంచం కోళ్ళలా ముగ్గురు అని రెండు వేళ్ళు చూపించాడట.
పాండవులు సంపాదించిన రాజ్యం కౌరవుల తద్దినానికే సరిపోయిందట.
పండిత పుత్ర:పరమ శుంఠ:
పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు.
పప్పులో కాలేసినట్టు…
పరాయి సొమ్ము పాము వంటిది.
పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు.
పట్ట పగలు కాకులు కావు కావు మంటుంటే మొగుడ్ని కౌగలించుకుందట.
పట్టిందల్లా బంగారమైనట్లు.
పెదవి దాటిటే పృధివి దాటుతుంది.
పీనాసి వాడి పెళ్ళికి పచ్చడి మెతుకులు సంభావనట.
పెళ్ళి అంటే నూరేళ్ళ పంట.
పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్టు.
పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు.
పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు.
పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికి వదిలిపెట్టిందట.
పెరుగుట తరుగుట కొరకే.
పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు.
పిచ్చోడి చేతిలో రాయిలా.
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం.
పిలవని పేరంటానికి వెళ్ళినట్లు.
పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాట్ట
పిల్లికి బిచ్చం వేయడు
పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా?
పిల్లికి చెలగాటం,ఎలుకకు ప్రాణ సంకటం.
పిల్లికి ఎలుక సాక్ష్యం.
పిండి కొద్ధీ రొట్టె.
పిట్ట కొంచెం కూత ఘనం.
పోరు నష్టం పొందు లాభం.
పూస గుచ్చినట్లు చెప్పడం.
పోరాని చోట్లకు పోతే రారాని మాటలు రాకపోవు.
పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మట్టి అంటలేదన్నాడట.
పొరుగింటి పుల్ల కూర రుచి.
పొట్ట కోస్తే అక్షరం ముక్క లేదు అన్నట్లు.
పొట్టి వానికి పుట్టెడు బుద్ధులు.
పోటుగాడు పందిరి వెస్తే పిచికలు వచ్చి కూల దోసాయట.
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.
పుండు మీద కారం చల్లినట్లు.
పుణ్యం కొద్దీ పురుషుడు,దానం కొద్దీ బిడ్డలు.
పువ్వు పుట్టగానే పరిమళించును.

రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనం.
రాజుని చూసిన కళ్ళతో మొగుడ్ని చూస్తే చులకనే కదా
రామాయణంలో పిడకలవేట.
రాత రాళ్ళ పాలు ఐతే,మొగుడు ముండ పాలు అయ్యాడట.
రాజు గారి రెండో భార్య మంచిది అంటే మరి పెద్ద భార్య?
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా
రామాయణం అంతా విని సీత రాముడికి ఏమౌతుందని అడిగినట్లు.
రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు.
రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అన్నట్లు.
రవి కాంచని చోట కవి గాంచునట…
రెడ్డొచ్చె మొదలాడె అన్నట్టు.
రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేసినట్లు.
రోలొచ్చి మద్దెలతో మొర పెట్టుకుందిట…
రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు.
రౌతు కొద్దీ గుర్రం.
రుణ శేషం శత్రు శేషం ఉంచరాదు.

సంబరాల పెళ్ళికొడుకు సప్తాష్టం లో కూడా వసంతాలన్నాడట.
సంకలో పిల్లాడిని ఉంచుకొని ఊరంత వెతికినట్టు.
సంతోషమే సగం బలం.
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం.
సత్రం భోజనం మఠం నిద్ర.
సీత కష్టాలు సీతవి,పీత కష్టాలు పీతవి.
సింగడు అద్దంకి పోనూ పొయ్యాడు రానూ వచ్చాడు.
శివుని ఆజ్ఞ లేక చీమైన కుట్టదు.
సొమ్మొకడిది సోకొకడిది
సుబ్బి పెళ్ళి ఎంకి చావుకి వచ్చింది.

శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ చచ్చింది అని అడిగాడట.
శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది.

తడిగుడ్డతో గొంతులు కోసే రకం.
తమ్ముడు తమ్ముడే,పేకాట పేకటే!
తా దూర కంత లేదు మెడకో డోలు.
తా చెడ్డ కోతి వనమెల్లా చెరచిందట.
తాడి తన్నే వాడి తల తన్నే వాడుంటాడు.
తాళిబొట్టు బలం వల్ల తలంబ్రాల వరకూ బతికాడన్నట్టు.
తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు.
తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురునా?
తాతకు దగ్గులు నేర్పుట.
తల్లి పిల్లల అరుగుదల చూస్తుంది,తండ్రి పిల్లల పెరుగుదల చూస్తాడు.
తన కోపమె తన శత్రువు.
తన్ను మాలిన ధర్మం-మొదలు చెడ్డ బేరం.
తంతే గారెల బుట్టలో పడ్డట్లు.
తను చెస్తే శృంగారం,పరులు చెస్తే వ్యభిచారం.
తను వలచిందే రంభ,మునిగిందే గంగ.
తీగ లాగితే డొంకంతా కదిలినట్లు.
తెగేదాకా లాగవద్దు.
తేనె పూసిన కత్తి.
తిక్కలోడు తిరనాళ్ళకు వెళితే ఎక్కా దిగా సరిపోయిందంట.
తినే ముందు రుచి అడక్కు,వినే ముందు కథ అడక్కు.
తినగా తినగా గారెలు కూడా చేదయినట్టు.
తిండి కోసం బ్రతక్కు,బ్రతకడం కోసం తిను.
తిండికి తిమ్మరాజు....పనికి పోతరాజు.
తింటే గారెలు తినాలి,వింటే భారతం వినాలి.
తియ్యటి తేనె నిండిన నోటితొనే తేనెటీగ కుట్టేది.
తిక్క మొగుడితో తీర్థం వెళితే తీర్థం అంతా తిప్పి తిప్పి కొట్టాడట.
తిలా పపం తలా పిడికెడు.
తిమ్మిని బమ్మిని చెయ్యడం.
తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్టు.
తుమ్మితే ఊడిపోయే ముక్కులా.

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు.
ఉన్నదీ పోయింది,ఉంచుకున్నదీ పోయింది.
ఉపాయం లేని వాడ్ని ఊళ్ళోంచి తరమాలి అన్నట్లు.
ఉపకారానికి పోతే అపకారమెదురైనట్లు.
ఉరుమురుమి మంగలం మీద పడ్డట్లు.
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగురుతానన్నట్టు.

వాపును చూసి బలము అనుకున్నాడట.
వడ్డించే వాడు మనవాడైతే యే పంక్తి లో కూర్చున్న పర్లేదు?
వడ్ల గింజలో బియ్యపు గింజ.
వండుకున్నమ్మ కన్నా దండుకున్నమ్మే గొప్ప.
వీపుమీద కొట్టవచ్చు కాని కడుపు మీద కొట్టరాదు.
వెన్నతో పెట్టిన విద్య.
వెర్రి వేయి విధాలు.
వెయ్యి అబద్ధలాడైనా ఒక పెళ్ళి చెయ్యమన్నట్లు.
వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పే వాడు వేదాంతిట.
వినాశ కాలే విపరీత బుద్ధి.

Wednesday, August 5, 2009

తెలుగు జాతి మనది

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స"-

అన్న శ్రీ కృష్ణదేవరాయల వారి పలుకులు అక్షర సత్యాలు.

"తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది!
తెలంగాణ నాది, నెల్లూరు నాది, సర్కారు నాది, రాయలసీమ నాది!
అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదే రా!"-

అన్న సి.నా.రె మాటలు అక్షర లక్షలు.

"ప్రసరింపగ రారండి దశదిశల తెలుగు వెలుగు!
వ్యాపింపగ చేరండి,ఆ జిగిబిగి సొగసుల గుబగుబలు!"

మా తెలుగు తల్లికి మల్లె పూదండ! మముగన్న తల్లికీ మంగళారతులు!

-- జై తెలుగు తల్లీ!

Monday, April 6, 2009

తాళ్ళపాక అన్నమాచార్యులు

తాళ్ళపాక అన్నమాచార్యులు (1408-1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.

కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.

చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.    

10వ శతాబ్దంలో వారాణసిలో తీవ్రమైన కరవు వచ్చినపుడు కొందరు పండితులు దక్షిణాదికి వలస వచ్చారని, వారిలో "నందవరం" గ్రామంలో స్థిరపడినవారు వందవారికులయ్యారని అంటారు. అన్నమయ్య కూడా నందవారికుడే. అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట. వూరిలో గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒకబాలుడు జన్మిస్తాడని చెప్పిందట. నారాయణయ్య కొడుకు నారాయణ సూరి. విద్యావంతుడు. అతని బార్య లక్కమాంబ. ఆమెది తాళ్ళపాక సమీప గ్రామం మాడుపూరు. అక్కడ ఉన్న విష్ణువు కోవెలలో అమె శ్రద్ధగా మాధవుని అర్చించేదట. వారికి చాలా కాలం సంతానం కలుగలేదు. అతడు, అతని భార్య సంతానార్ధులై తిరుమలను దర్శించారట. ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాధ.

అలా పుట్టిన శిశువే అన్నమయ్య. సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడింది.

అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొదిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏక సంధాగ్రాహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. తన పదహారవ యేట అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటినుండి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలను రచింపసాగాడు.

ఒకనాడు (8వ ఏట) ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. తిరుమలకు వెళ్ళే కొండదారిలో ఆయనకు అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించినదనీ, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించినదనీ చెబుతారు. అప్పుడు పరవశించి అలమేలుమంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీవేంకటేశ్వర శతకము రచించాడు. తిరుమల శిఖరాలు చేరుకొన్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, వరాహ స్వామి దేవాలయంలో ఆదివరాహ స్వామిని దర్శించుకొన్నాడు. పిదప వేంకటపతి కోవెల పెద్దగోపురము ప్రవేశించి "నీడ తిరుగని చెంతచెట్టు"కు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, గరుడ స్తంభానికి సాగిలి మ్రొక్కాడు. సంపెంగ మ్రాకులతో తీర్చిన ప్రాకారము చుట్టి "విరజానది"కి నమస్కరించాడు. భాష్యకారులైన రామానుజాచార్యులను స్తుతించి, యోగ నరసింహుని దర్శించి, జనార్దనుని (వరదరాజస్వామిని) సేవించి, "వంట యింటిలో వకుళా దేవి"కు నమస్కరించి, "యాగశాల"ను కీర్తించి, ఆనంద నిలయం విమానమును చూచి మ్రొక్కాడు. కళ్యాణమంటపమునకు ప్రణతులిడి, బంగారు గరుడ శేష వాహనములను దర్శించాడు. శ్రీభండారమును చూచి, బంగారు గాదెలను (హుండీమి) సమర్పించి తన పంచె కొంగున ముడివేసుకొన్న కాసును అర్పించాడు. బంగారు వాకిలి చెంతకు చేరి, దివ్యపాదాలతో, కటివరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమనంగళ శ్రీమూర్తిని దర్శించుకొన్నాడు. తీర్ధ ప్రసాదాలను స్వీకరించి, శఠకోపముతో ఆశీర్వచనము పొంది, ఆ రాత్రి ఒక మండపములో విశ్రమించాడు. తరువాత అన్నమయ్య కొండపై కుమార ధార, ఆకాశ గంగ, పాప వినాశం వంటి తీర్ధాలను దర్శించి, కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలు విని అర్చకులు అతనిని ఆదరించ సాగారు.

తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞనను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడప సాగాడు.

అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు. ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. కాని నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్లతో కూడి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు.

అప్పటినుండి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు. తరువాత అన్నమయ్య తన భార్యలతో కలసి తీర్ధయాత్రలకు బయలుదేరాడు. వారు ముందుగా తమ వూరిలో చెన్నకేశవుని అర్చించారు. మార్గంలో నందలూరు సౌమ్యనాధుని, ఒంటిమిట్ట రఘురాముని, కడప వేంకటరమణుని, చాగలమర్రి చెన్నకేశవుని దర్శించుకొన్నారు. తరువాత నవనారసింహ క్షేత్రం అయిన అహోబిలం చేరుకొని శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని ఆనందించారు. ఆ క్షేత్రాన్ని, తీర్ధాన్ని, దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్తుతించాడు. అహోబల మఠ స్థాపనాచార్యుడైన ఆదివణ్ శఠకోపయతులవద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మస్వరూపమునర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకొన్నాడు. ఇంకా అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకొన్నాడు. అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధం కాజొచ్చాయి.

విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీకృష్ణదేవరాయలుకు తాత), టంగుటూరు కేంద్రంగా ఆ సీమ (పొత్తపినాడు) పాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి "మూరురాయర గండ" అనే బిరుదుండేది. అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహాత్మ్యం గురించి విన్న దండనాధుడు తాళ్ళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నాడు. తరువాత అతను పెనుగొండ ప్రభువయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో హరిదాసకూటాలలో ప్రసిద్ధమయ్యింది. తరువాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక్కపదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున, కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట. అన్నమయ్య నరహరిని కీర్తించగా ఆ సంకెళలు తోలగిపోయాయట.

రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. వేంకటాచలానికి సమీపంలో ఉన్న "మరులుంకు" అనే అగ్రహారంలో నివసించేవాడు. ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి. అంతఃకలహాలలో రాజవంశాలు మారాయి. అన్నమయ్య జీవితంపట్ల విరక్తుడై నిత్యసంకీర్తనలతో పొద్దుపుచ్చేవాడు. అతని కీర్తనలలోని ఆశీర్వచన మహాత్మ్యం కధలు కధలుగా వినిన ప్రజలు అతని సంకీర్తనా సేవకు జనం తండోపతండాలుగా రాసాగారు.

ఈ సమయంలోనే పురందర దాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరూ వయోవృద్ధులు. భక్తశ్రేష్టులు. విష్ణుసేవాతత్పరులు. సంగీత కళానిధులు. ఒకరినొకరు ఆదరంతో మన్నించుకొన్నారు. "మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే" అని పురందరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు "సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే" అన్నాడట.

95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.

ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", పంచమాగమ సార్వభౌముడు", ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట.

అన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. అధికంగా తెలుగులోనే పాడినా అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. కొన్నియెడల తమిళ, కన్నడ పదాలు కూడా చోటు చేసుకొన్నాయి. అతని తెలుగు వ్యావహారిక భాష. మార్గ, దేశి సంగీత విధానాలు రెండూ అతని రచనలలో ఉన్నాయి. అన్నమయ్యకు పూర్వం కృష్ణమాచార్యుల వచనాలవంటివి ఉన్నా గాని అవి "అంగాంగి విభాగం లేక, అఖండ గద్య ధారగా, గేయగంధులుగా" ఉన్నాయి. శివకవుల పదాలగురించి ప్రస్తావన ఉన్నాగాని అవి లభించడంలేదు. మనకు లభించేవాటిలో అన్నమయ్యవే తొలిసంకీర్తనలు గనుక అతను "సంకీర్తనాచార్యుడు", 'పదకవితా పితామహుడు" అయ్యాడు.

అన్నమయ్య "యోగ వైరాగ్య శృంగార సరణి" మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నవి. రేకులమీది అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడంలేదు. (వాటిని కొందరు కరగించుకొని ఉండవచ్చును.)

"సంకీర్తనా లక్షణమనే" సంస్కృత గ్రంధం కూడా అన్నమయ్య వ్రాశాడట. మంజరీ ద్విపదలో "శృంగార మంజరి" అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో "వేంకటేశ్వర శతకము" ఒక్కటి మాత్రమే లభిస్తున్నది. ఇతర ప్రబంధాలు, వేంకటాచల మహాత్మ్యము, సంకీర్తనలక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంధాలు లభించలేదు.

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో అన్నమయ్య రచనలు " ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిధ్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన దివిపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే"

అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.

తాళ్ళపాక కవులు

తాళ్ళపాక అన్నమయ్య వంశం తెలుగు సాహిత్యానికి ఆభరణం. అన్నమయ్య తండ్రి మహాపండితుడు. తల్లి సంగీతకళానిధి. అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రి. "సుభద్రా కళ్యాణం" మంజరి ద్విపద కావ్యం రచించింది. ఈమె కుమారుడు నరసింహుడు సంగీత సాహిత్య కళా కోవిదుడని చిన్నన్న వ్రాశాడు ("పాడఁజెప్పఁగ వర్ణపద్ధతినీడు, జోడులేఁడని సభ సొచ్చి వాదించి, పరఁగిన ధీశాలి ప్రతివాదదైత్య నరసింహుఁడనఁగల్గె నరసింహగురుఁడు"). కవికర్ణ రసాయనం అనే కావ్యాన్ని వ్రాసిన సంకుసాల నృసింహకవి ఇతడేనని కొందరి అభిప్రాయం. నరసింగన్న భార్యలు వాచ్చారమ్మ, అనంతమ్మ. వారి పుత్రులు నారాయణుడు, అప్పలార్య, అన్నలార్య.

తిరుమలాచార్యుడు తండ్రి వలెనే సంకీర్తనా యజ్ఞం నిర్వహించాడు. ఇతని ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలతో పాటు మరికొన్ని లఘురచనలు లభించాయి. వెంకటేశ్వర వచనములు, శృంగార దండకము, చక్రవాళ మంజరి, శృంగార వృత్త శతకము, వేంకటేశ్వరోదాహరణము, నీతి సీసశతకము, సుదర్శన రగడ, రేఫఱకార నిర్ణయం, ఆంధ్ర వేదాంతం (భగవద్గీత తెలుగు అనువాదవచవం), శ్రీ వేంకటేశ ప్రభాత స్తవము (ద్విపద), సంకీర్తనా లక్షణ వ్యాఖ్యానం (అలభ్యం) వంటివి రచించాడు. ఇతని భార్య తిరుమలమ్మ. వారి కొడుకులు చిన తిరుమలయ్య, అన్నయ్య, పెదతిరువెంగళ నాధుడు, చినతిరువెంగళనాధుడు (చిన్నయ్య లేదా చిన్నన్న), కోనేటి తిరువేంగళనాధుడు. చినతిరుమలయ్య తన తండ్రి, తాతలవలెనే ఆధ్యాత్మ, శృంగార సంకీర్తనలు రచించాడు. ఇంకా అష్టభాషా దండకం, సంకీర్తన లక్షణం (తండ్రి, తాతల సంస్కృత రచనలకు అనువాదం) వ్రాశాడు.

చినతిరుమలయ్య, అతని భార్య పెదమంగమ్మల కొడుకు తిరువేంగళప్ప అమరుక కావ్యానువాదము, అమరకోశానికి బాల ప్రబోధిక వ్యాఖ్య, ముమ్మటుని కావ్య ప్రకాశికకు సుధానిధి వ్యాఖ్య, రామచంద్రోపాఖ్యానం (అలభ్యం) వంటి రచనలు చేశాడు. పెద తిరుమలయ్య కొడుకు చిన్నన్న జనుల మన్ననలు పొందిన పరమ భక్తుడు, మహాగాయకుడు, భజన సంప్రదాయ ప్రచారకుడు, ద్విపద కవితకు విశేషంగా ప్రచారాన్ని కలిగించాడు. ఇతడు రచించిన అన్నమాచార్యుని జీవిత చరిత్రయే మనకు అన్నమయ్య జీవితానికి సంబంధించిన ప్రధాన ఆధార గ్రంధము. అంతే గాక ఇతడు పరమయోగి విలాసము, అష్టమహిషీ కళ్యాణము, ఉషా పరిణయము అనే ద్విపద కావ్యాలను రచించాడు. అన్నమయ్య, అక్కలమ్మల కుమార్తె తిరుమలాంబను తిరుమల కొండయార్యునికిచ్చి పెండ్లి చేశారు. వారి కొడుకు రేవణూరి వెంకటాచార్యుడు శకుంతలా పరిణయము, శ్రీపాదరేణు మహాత్మ్యము.

ఇలా తాళ్ళపాక కవులు తెలుగు భాషకు, ప్రత్యేకించి పదకవితకు, ద్విపద కవితకు ఎనలేని సంపదను ఒనగూర్చారు. "చిన్నన్న ద్విపద కరగును, పన్నుగ పెద తిరుమలయ్య పదమునకెరగున్, మిన్నంది మొరసె నరసింగన్న పద్య గద్య శ్రేణిన్" అని తెనాలి రామకృష్ణుని చాటువు.

Tuesday, March 3, 2009

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ!

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలేపండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
అమరావతి నగరి అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడునాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి
మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలేఆడుతాం - నీ పాటలే పాడుతాం
జై తెలుగుతల్లీ! జై తెలుగుతల్లీ!

 
-శంకరంబాడి సుందరాచార్య

గోవింద నామాలు

శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా
భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుష గోవిందా
పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

నందనందన గోవిందా
నవనీత చోర గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా
దురిత నివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

వజ్రమకుటధర గోవిందా
వరాహమూర్తివి గోవిందా
గోపీజనలోల గోవిందా
గోవర్దనోద్దార గోవిందా
దశరథనందన గోవిందా
దశముఖ మర్దన గోవిందా
పక్షివాహన గోవిందా
పాండవప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

మత్స్యకూర్మా గోవిందా
మధుసూదన హరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్దకల్కిధర గోవిందా
వేణుగాన ప్రియ గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

సీతానాయక గోవిందా
శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజనపోషక గోవిందా
ధర్మసంస్థాపక గోవిందా
అనాథ రక్షక గోవిందా
ఆపద్భాంధవ గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

కమలదళాక్ష గోవిందా
కామితఫలదాతా గోవిందా
పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీ ముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

పద్మావతీప్రియ గోవిందా
ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్త ప్రదర్శన గోవిందా
మర్త్యావతారా గోవిందా
శంఖచక్రధర గోవిందా
శార్ఙగదాధర గోవిందా
విరజాతీర్థస గోవిందా
విరోధిమర్దన గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

సాలగ్రామధర గోవిందా
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
కస్తూరితిలక గోవిందా
కాంచనాంబరధర గోవిందా
గరుడవాహన గోవిందా
గజరాజరక్షక గోవిందా
గోవిందా హరి గొవిందా
గోకులనందన గోవిందా
వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణా గోవిందా
రఘుకులనందన గోవిందా
ప్రత్యక్షదేవ గోవిందా
పరమదయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

వజ్రకవచధర గోవిందా
వైజయంతిమాల గోవిందా
వడ్డీకాసులవాడ గోవిందా
వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీపుంరూపా గోవిందా
శివకేశవమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా
భక్త రక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

నిత్యకళ్యాణ గోవిందా
నీరజనాభ గోవిందా
హాతీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్దనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియ గోవిందా
ఆపన్నివరణ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

రత్న కిరీటా గోవిందా
రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశ గోవిందా
ఆశ్రితపక్ష గొవిందా
నిత్యశుభప్రద గోవిందా
నిఖిలలోకేశా గోవిందా
ఆనందరూప గోవిందా
ఆద్యంతరహిత గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గొవిందా

ఇహపరదయక గోవిందా
ఇభరాజరక్షక గోవిందా
పరమదయాళో గోవిందా
పద్మనాభ హరి గోవిందా
తిరుమలవాసా గోవిందా
శేషాద్రి నిలయ గోవిందా
శేష శాయిని గోవిందా
శ్రీనివాస శ్రీ గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

వేదములు

వేదములు నాలుగు. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వేదము. అధర్వేదమును బ్రహ్మవేదము అని కూడా అoటారు.
  • ఋగ్వేదము - దేవతల గుణగణాలను స్తుతిస్తుoది.
  • యజుర్వేదము - యజ్నములు వాటికి స్తooధిoచిన కర్మకాండలను ఫలితాలను తెలియజేస్తుంది.
  • సామవేదము - సంగీత ప్రధానం.
  • అధర్వణ వేదము - బ్రహ్మజ్నానాన్ని, ఔషధీ విశేషాలను, యంత్ర పరికరాల వివరాలను తెలుపుతుంది.

అని వేధోక్తి. అంటే వేదాలను మీరు కాపాడండి, అవి మిమ్ములను కాపాడతాయి.
"వేధో రక్షితి రక్షిత: "

నిరవధి సుఖదా

రాగం:
రవిచంద్రిక

పల్లవి:
నిరవధి సుఖదా నిర్మల రూప నీర్జిత మనిశాపా

అనుపల్లవి:
శరధి బందన నత సంక్రందన శంకరాది గీయమాన సాధు మానస సుసదన

చరణం:
మామవ మరకట మణినిభదేహ శ్రీమణిలోల శ్రితజన పాల
భీమ పరాక్రమ భీమ కరార్చిత తామస మానవ దూర త్యాగరాజ వినుత చరణ

Monday, March 2, 2009

కార్తీక దీపం (ఆకాశ దీపం)

ఆశ్వయుజ అమావాస్య అయిన మరుసటి రోజు ప్రారంభమయ్యె మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో దేవాలయాలలోని ధ్వజస్తoభానికి పైభాగాన జ్యొతిర్మార్గoలో వెలుతూoడే పితృదేవతలoదరికీ మార్గాన్ని చూపించేoదుకు ఓ దీపాన్ని పెడుతారు. దీనినే కార్తీక దీపం లేదా ఆకాశ దీపం అంటారు. ఈ దీపం ఆ నెల రోజుల పాటూ ఉoడి తీరవల్సిoదే.