హిందూ పురాణాల ప్రకారం, వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని “ వైశాఖ పూర్ణిమ ” అని పిలుస్తారు. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనదిగా భక్తులు భావిస్తారు. భవిష్య పురాణం ప్రకారం అమృతం కోసము దేవతలు, రాక్షసులు మందరగిరి పర్వతాన్ని కవ్వంగా మరియు వాసుకిని తాడుగా చేసుకుని క్షీర సాగర మథనం ప్రారంభించారు. అప్పుడు మందర పర్వతం తన బరువుకు సముద్రంలో మునిగిపోవడంతో వారు శ్రీ మహా విష్ణువును ప్రార్ధించగా, వారి ప్రార్థనలు మన్నించిన శ్రీ మహా విష్ణువు కూర్మ అవతారం రూపం దాల్చి పాల సముద్రం అడుగున ఉన్న మందర పర్వతాన్ని తన వీపుపై మోస్తూ పైకి లేపాడు. కూర్మ రూపంలో శ్రీ మహా విష్ణువు అవతరించిన రోజు కాబట్టి ఈ రోజును “ కూర్మ జయంతి ” అంటారు. అలాగే శ్రీమహావిష్ణువు ప్రహ్లాదుడి కోరికపై నృసింహ అవతారం దాల్చి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షించింది కుడా ఈ వైశాఖ పూర్ణిమ రోజే. ఈ వైశాఖ పూర్ణిమ బౌద్ధులకు కూడా ఎంతో ప్రత్యేకమైన రోజు. అహింసే పరమ ధర్మమని బోధించిన మహనీయుడు బుద్ధుడు కూడా వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు ప్రాచీన భారతదేశంలో భాగమైన లుంబినీ (ప్రస్తుతం నేపాల్‌లో ఉంది)లో సిద్దార్ధునిగా జన్మించాడు. ఇతని తల్లిదండ
తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు మరియు తెలుగు వారి విశిష్టతలు