/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Monday, December 6, 2010

కార్తీకమాసంలో దీపదానం

న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్‌
నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరం!
కార్తీక మాసమంత పవిత్ర మాసం లేనేలేదని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నదీస్నానం ఆచరించి, నదీస్నానం లభ్యం కాకపోతే లభ్యమైన జలాలతోనే సాన్నం ఆచరించి, 'కార్తీక దామోదర ప్రీత్యర్ధం అని విష్ణువుని పూజిస్తే విశేష ఫలం లభిస్తుంది. అదేవిధంగా శివాలయంలో దీపా రాధన చేస్తే చాలా మంచిది. శరత్‌ రుతువులో చంద్రుడు పూర్ణిమ నాడు 'కృత్రికా నక్షత్రం దగ్గరగా రావడం వల్ల ఈ మాసం కార్తీకమాసంగా పిలువబడుతుంది. కార్తీకమాసంలో దీపదానం ఉత్తమఫలాన్ని ఇస్తుంది.

నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం కార్తీక పురాణ పఠనం, వనభోజనాలు కార్తీకమాసంలో ముఖ్యంగా జరుప వలసిన విధులు. కార్తీక మాసంలో నాగుల చవితి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీకపౌర్ణమి మొదలగు ముఖ్యమైన పండుగలు జరుపుకుంటారు. ఈ నెల రోజులు కార్తీకపురాణం రోజుకు ఒక అధ్యాయం పఠనం చేయడం వల్ల శివప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం కార్తీకమాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో దేశ వ్యాప్తంగా శివార్చనలు జరుపుతారు. శివుడు అభి షేకప్రియుడు ''అభిషేక ప్రియః శివః శివాభిషేకం అన్ని శుభాలను ప్రసాదిస్తుంది అని అర్ధం. శివునికి ''అర్కద్రోణ ప్రభృతి కుసుమైః అర్చనంతే విధేయం అనగా జిల్లేడు, ఉమ్మెత్త పువ్వులతో శివుడిని అర్చిస్తే శివానుగ్రహం లభిస్తుంది.

ఇంకను శివుణ్ణి తులసి, మారేడు(బిల్వ) పతాల్రతో శివాలయంలో, విష్ణు ఆలయంలో సాయం సంధ్య వేళల్లో పూజించి దీపాలు పెట్టడం వల్ల దివ్యమైన ఫలాలు లభిస్తాయి. ఈ మాసంలో స్వగృహంలో తులసీ సన్నిధిలోను, దేవాయలంలోను దీపం పెట్టడం వలన అఖండ, ఐశ్వర్యాలు లభిస్తాయని శాస్త్రాలలో చెప్పబడింది. ఈ మాసంలో పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివార్చనం లేదా విష్ణుపూజ చేసి నక్షత్రదర్శనం చేస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. కార్తీక సోమవారం శివునికి ప్రీతికరమైనది.

ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు తొలగిపోతాయి.కార్తీకమాసంలో 'అయ్యప్ప దీక్షలు స్వీకరిస్తారు. ఈ మాసంలో ఏ దీక్ష అనుసరించినా మోక్షదాయకమే. ''కార్తీకేతు కృతదీక్షా నృణాం జన్మవిమోచనీ. కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద బంధుమిత్ర సహితంగా 'కార్తీక సమారాధన నేటికీ ఆచరణలో ఉంది. విష్ణుప్రీతికై సూర్యాస్తమ య కాలమందు ఆకాశ దీపాన్ని వెలిగించడం వల్ల శివసాన్నిధ్యం లభిస్తుందని పురాణాలలో చెప్ప బడింది.అంతేకాక, ఉసిరికాయ, అరటి దొప్ప లలో దీపాలను పెట్టి చెరువులలో, నదులలో విడి చిపెట్టి భగవదార్పణం చేయడం సాంప్రదాయం.

2 comments: