ఆ విగ్రహ సౌందర్యం చూచి ఆ విగ్రహాన్ని, తన అంతఃపురములో తన వద్దనే ఉంచుకొన్నది. ఆ తరువాత కొంత కాలానికి శ్రీ రామానుజాచారి డిల్లి సుల్తాన్ని ఒప్పించి, విగ్రహాన్ని తీసుకొని తిరునారాయణపురానికి బయలుదేరారు. ఆ విగ్రహాన్ని ఘాడంగా ప్రేమించిన బీబీ నాంచారమ్మ కూడా స్వామి విగ్రహాన్ని అనుసరించి తిరునారాయణపురానికి బయలుదేరారు. అక్కడ ప్రతిస్టించిన స్వామి మూర్తిని విడిచి రాలేక అక్కడే స్వామి వారిలో ఐక్యం అయినది.
ఈ విధంగా ఆండాళ్ వలే స్వామిని ఘాడంగా ప్రేమించిన బీబీ నాంచారమ్మ విగ్రహాన్ని తయారుచేయించి, శ్రీ రామానుజాచారి శ్రీ రంగంలో ప్రతిస్టించినారు. ఇప్పటికి ఆ బీబీ నాంచారమ్మ విగ్రహానికి అక్కడ పూజాది కైంకర్యాలు నిర్వహించబడుతున్నాయి.
ఆ తల్లిని బీబి నాచ్చియర్ అంటారు ....
ReplyDeleteబీబి నాచ్చియర్ , బీబి నాచ్చియరమ్మ....బీబి నాంచారమ్మగా మారింది.
సనత్కుమార స్వామి అర్చామూర్తి మహిమ చాలా గొప్పది....
శీమద్రామానుజాచార్యుల వారి వైభవం.
దివ్యదేశమైన 'మేల్కోట'లో , అమ్మ వారి విగ్రహం ఇక్కడ చూడచ్చు.
http://3.bp.blogspot.com/_7uqcYErI-rY/TPuN4OvZ97I/AAAAAAAABms/z5miYzH79ok/s1600/5_YadugiriNachiyar.jpg
ధన్యవాదాలతో...
--సత్య
రామానుజాచారి కాదండి రామానుజాచార్యులు అనాలి.
ReplyDeleteబీబీ నాంచారమ్మ(వేంకటేశ్వరుని రెండవ భార్య)ముస్లిం స్త్రీ.బీబీ నాంచారమ్మ కథను విశ్వసిస్తూ చాలామంది ముస్లిములు నేటికీ తిరుమలను దర్శించుకుంటున్నారు.ప్రొద్దుటూరుకు చెందిన డా.సి.వి.సుబ్బన్న శతావధాని రచించిన "బీబీ నాంచారి ప్రబంధము" తిరుపతిలో తెలుగు భాషోధ్యమ సమితి ఆధ్వర్యంలో 25.4.2010 న ఆవిష్కరణ జరిగింది.కర్నాటకలోని మేల్కోటే లోని చెళ్ళపిళ్ళరాయుని విగ్రహాన్ని డిల్లీ సుల్తాన్ డిల్లీ కి తెప్పిస్తాడు.ఆ విగ్రహాన్ని ఆయన కుమార్తె ఆరాధిస్తుంది.ప్రేమలో పడుతుంది.వెంకటేశ్వరుడు సుల్తాన్ కు కలలో కనపడి ఆయన కుమార్తెను వివాహమాడతానని చెపుతాడు.సుల్తాన్ అంగీకరిస్తాడు.గోదాదేవి లాగానే నాంచారి కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది.వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి మతాంతర వివాహాలు కు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని శతావధాని చెప్పారు.http://beta.thehindu.com/arts/books/article415269.ece
ReplyDeleteప్రతి మంగళవారం తిరుమలలో మూలవిరాట్టుకు హైదరాబాదుకు చెందిన సయ్యద్ మీర్జా అనే ముస్లిం సమర్పించిన 108 బంగారు పుష్పాలతో బాలాజీ 108 నామాలు ఉచ్చరిస్తూ "స్వర్ణ పుష్పార్చన" లేదా "అష్టదళ పాద పద్మారాధన" చేస్తారు. ఉత్సవదేవతలైన శ్రీదేవి, భూదేవిలకు సయ్యద్ మీర్జా సమర్పించిన రెండు మంగళసూత్రాలనే నేటికీ వేంకటేశ్వర కళ్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు.
http://ravindrasriramanujadasan.co.cc/tirumala/impq/tfaq13.html
Muslims invaded Melkote in 14th century, where as Ramanujacharyulu died in 12th century, so, its hard to believe that.
ReplyDeleteAnd, Cheluvanarayana Swamy Temple was restored by Ramanujacharyurlu, but its not true that he recovered deity, it was famous temple long before Ramanujacharyulu, but he helped to rebuild the old temple.
I can hardly believe this story since tughlaqs are known for Hindu slavery.