జయ మరియు విజయుల పౌరాణిక కథ
ఒక రోజు బ్రహ్మ యొక్క మానసపుత్రులైన సనక, సనత్కుమార, సనంద మరియు సనత్సు మహర్షులు శ్రీ మహా విష్ణువు దర్శనానికి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఈ మహర్షులు యోగశక్తితో సమస్త లోకాలను సంచరించే పరాక్రమ కలిగిన వారు. వారు ఎప్పుడూ పిల్లలుగా కనిపించే ప్రత్యేక వరం పొందినవారు. వీరి మహత్త్వాన్ని గుర్తించక జయుడు మరియు విజయుడు వారిని అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన సనకాదుల మహర్షులు కోపంతో జయ, విజయులను, "మీరు భూలోకంలో మానవులుగా జన్మించండి" అని శపించారు.జయ విజయుల శాప పరిష్కారం
ఈ శాపం గురించి విష్ణుమూర్తికి తెలిసి, ఆయన స్వయంగా ద్వారానికి వచ్చి, సనక, సనంద మహర్షులను లోపలికి తీసుకెళ్లారు. జయ మరియు విజయులు తమ చేసిన తప్పు గురించి క్షమాపణలు కోరారు. వారిని శాపం నుండి విమోచించమని వేడుకొనగా వారికి రెండు ప్రత్యామ్నాయాలను ఇచ్చారు- హితులుగా ఏడు జన్మలు భూలోకంలో ఉంటారా?
- విరోధులుగా మూడు జన్మలు శాప ఫలితాన్ని అనుభవిస్తారా?
మూడు జన్మల రాక్షసత్వం
మొదటి జన్మ – హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపు:
హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపు రాక్షసులుగా జన్మించి, విష్ణుమూర్తిని ద్వేషించారు. హిరణ్యకశిపు తన కుమారుడు ప్రహ్లాదుని విష్ణుమూర్తికి భక్తుడిగా చూసి, తనతో వివాదించాడు. "నారాయణుడు ఎక్కడ ఉందని చెప్పు!" అని అడిగి, శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుడిని సంహరించారు.
రెండో జన్మ – రావణుడు మరియు కుంభకర్ణుడు:
రావణుడు మరియు కుంభకర్ణుడు రాక్షసులుగా జన్మించి, విష్ణుమూర్తి అవతారం అయిన రాముడితో యుద్ధం చేసి, ఆయన చేతిలో హతమయ్యారు.
మూడో జన్మ – శిశుపాలుడు మరియు దంతవక్త్ర:
ఈ జన్మలో కూడా, విష్ణుమూర్తి అవతారం అయిన శ్రీ కృష్ణుడి చేతిలో శిశుపాలుడు మరియు దంతవక్త్ర హతమయ్యారు.
Comments
Post a Comment