అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।
కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం ।
జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥
-
హనుమంతుడు
శివతేజస్సు మరియు వాయు మహిమతో పుట్టిన హనుమంతుడు రామాయణంలో రాముడికి అత్యంత నమ్మకమైన భక్తుడు. రాముని సేవ చేయడం కోసం ఏ అవకాశాన్ని వదలకుండా, తన భక్తి వల్లనే చిరంజీవిగా నిలిచాడు. -
విభీషణుడు
రావణుడి తమ్ముడైన విభీషణుడు ధర్మం కోసం రాముని పక్షాన నిలిచాడు. తన అన్నను విడిచి, రాముడి వద్ద శరణు పొందిన విభీషణుడు కల్పాంతం వరకూ చిరంజీవిగా ఉండే వరాన్ని పొందాడు. -
బలి చక్రవర్తి
ప్రహ్లాదుని మనవడు అయిన బలి, వామన అవతారంలో విష్ణువుకు మూడడుగుల నేలను దానం చేశాడు. రెండు అడుగులతో యావద్విశ్వాన్ని ఆక్రమించిన తరువాత, మూడో అడుగు ఎక్కడ పెట్టమని అడగగా, తన తలను చూపించాడు. త్రివిక్రముడైన వామనుడు అతన్ని పాతాళానికి పంపి చిరంజీవిగా ఆశీర్వదించాడు. -
పరశురాముడు
విష్ణువు అవతారమైన పరశురాముడు, తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపి మళ్లీ ఆమెను బతికించమని వరం కోరుకున్నాడు. తండ్రిని చంపిన క్షత్రియ జాతిపై ప్రతీకారం తీర్చుకోవడానికి 21 సార్లు యుద్ధం చేసి వారిని నాశనం చేశాడు. పరశురాముడు శాశ్వతంగా జీవించాడని పురాణాలు చెబుతాయి. -
కృపాచార్యుడు
కౌరవ పాండవుల కుల గురువైన కృపాచార్యుడు, ద్రోణుని బావమరది. కురుక్షేత్ర యుద్ధంలో బ్రతికి మిగిలిన అతి కొద్దిమందిలో అశ్వత్థామతో పాటు కృపుడు ఒకడు. అతను వంశ పరంపర లేకుండా జన్మించడంతో మరణం లేకుండా చిరకాలం జీవిస్తాడు. -
వేదవ్యాసుడు
వేదాలను విభజించి భారత, భాగవత గ్రంథాలను రచించిన వేదవ్యాసుడు భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన పాత్ర. ఇతని రచనలు భారత భాగవత గ్రంథాలకు మూలం. -
అశ్వత్థామ
ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ, కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షంలో నిలిచి పోరాడాడు. ఉపపాండవులను గొంతు కోసి చంపినందుకు శ్రీకృష్ణుడు అతనికి శపం ఇచ్చాడు. ఈ శాపం ప్రకారం, అతను ఒళ్ళంతా వ్రణాలతో మూడు వేల సంవత్సరాలు చావు లేకుండా చిరంజీవిగా ఉంటాడు.
No comments:
Post a Comment